బోనాల వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు

నవతెలంగాణ – ఆర్మూర్   

హైదరాబాద్ గోల్కొండ కోటలో జరుగుతున్న జగదాంబిక మాత అమ్మవారి తొలి బోనాల కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సతీమణి పైడి రేవతి రెడ్డి తో కలిసి ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..  తెలంగాణలో బోనాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది అని, ప్రతి పనికి ముందు అమ్మవార్ల మొక్కులు చెల్లించడం ఆనవాయితీ అని, గోల్కొండ బోనాలతో రాష్ట్ర వ్యాప్తంగా బోనాల పండుగ ప్రారంభమవుతుందన్నారు.  ప్రభుత్వం భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో  విశ్వహిందూ పరిషత్ నాయకులు శ్రీనివాస రాజ బజరంగ్దళ్ నాయకులు నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.