9న సీత్లా భవాని పండుగ జరుపుకుందాం: భూక్యా సంతోష్ నాయక్ 

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
బంజారా గిరిజనలు ఎంతో పవిత్రంగా పూజించుకునే సిత్లా భవాని (దాటుడు) పండుగను వేరువేరు తేదీలో కాకుండా అందరూ ఒకేసారి ఈ నెల 9న మంగళవారం రోజున జరుపుకొని బంజర జాతి యొక్క ఐక్యతను చాటాలని లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు భూక్య సంతోష్ నాయక్  కోరారు. ఆదివారం అయన విలేకరులతో మాట్లాడుతూ ప్రకృతిని పూజించడం ప్రేమించడం గిరిజనుల ప్రత్యేకత అని, ప్రపంచ భిన్న సంస్కృతిలో గిరిజన సంస్కృతి వేరు అని,గిరిజనుల కట్టు బొట్టు వేషాదరణ ఆచార వ్యవహారాలు సంస్కృతి సాంప్రదాయాలు అతి పవిత్రమైనది అన్నారు. అదేవిధంగా పండుగల సందర్భంగా పశువులను అలంకరించడం గిరిజన జాతి పూర్వీకుల నుండి ఆనవైతిగా వస్తుందన్నారు, ఏడుగురు  అమ్మవార్లు వారు కాళికామాత, తులజా భవాని, మేరమ్మ యాడి,( జగదాంబ మాత) సీతామ్మమాత, మంత్రాల్ మాత, హింగ్లజ్ మాత, ధ్వల్ అంగల్ యాడీలను కొలువు దిర్చి, ప్రజలు పంట పైర్లు పశు సంపద ఆరోగ్యంగా ఉండాలని పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఆషాడ మాసం శుక్లపక్షం మొదటి లేదా రెండో మంగళవారం గిరిజన జాతి శోభ ఉట్టిపడేలా శిథిల భవాని పండుగను జరుపుకోవడం ఆనవైతిగా వస్తుందని తెలిపారు. ప్రతి సంవత్సరం ఈ మాసంలో వచ్చే నాలుగు మంగళవారంలో వేరు వేరుగా దాటుడు పండుగను జరుపుకుంటున్నారు, అలాకాకుండా ఇకనుంచి బంజారా గిరిజనులంతా ఒక్కటై శుక్లపక్షం (చాందిని రాత్) మొదటి మంగళవారం జరుపుకోవాలని కోరారు లంబాడీ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేకంగా నిలిచే స్థితుల భవాని పండుగను జూలై 9 మంగళవారం రోజున రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనలంతా ఐక్యమై ఒకేసారి జరుపుకోవాలని పిలుపునిచ్చారు.