మండలంలోని మానిక్ బండారు గ్రామ శివారులో గల ఆర్టీసీ కాలనీ గల శ్రీ శక్తిమాన్ హనుమాన్ దేవాలయ నూతన కమిటీని కాలనీ వాసులు అందరు కలిసి ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన నూతన ఆలయ కమిటీ రెండు సంవత్సరాలు కొనసాగుతారని కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు ఎస్. రాజేందర్ తెలిపారు. 07 జూన్ 2024 నుండి 06 జూన్ 2026 వరకు ఎన్నిక కాబడిన ధ్రువ పత్రాలను ఆలయ నూతన కమిటీకి అందజేశారు. ఆలయ కమిటీ అధ్యక్షులుగా జి.హనుమంత్ రెడ్డి ,ప్రధాన కార్యదర్శిగా జి.సుదర్శన్ గౌడ్, కోశాధికారిగా డివి.రాములు, మిగత వారిని కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ అభివృద్ధి కమిటీ గౌరవ అధ్యక్షులు కె.సత్యం రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం.రోహిత్, కోశాధికారి వి.సుమన్, ఉపాధ్యక్షులు ఎన్.రాజేశ్వర్ రావు, సంయుక్త కార్యదర్శి ఎం.వేణు, సభ్యులు జి.పుష్పలత, రంగాచారి, ఏ. నాగభూషణం, కాలనీ వాసులు పాల్గొన్నారు.