ఎంపీ రఘురాంరెడ్డికి పలువురు వినతి

Many petitioned MP Raghuram Reddy– ఖమ్మం కేంద్రంగా జనరల్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి
నవతెలంగాణ-ఖమ్మం
ఖమ్మం కేంద్రంగా జనరల్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలన్నా డిమాండ్‌ను పరిష్కరించాలని, పెండింగ్‌లో ఉన్న మెస్‌ చార్జీలు, స్కాలర్‌ షిప్స్‌ విడుదల చేయాలనీ, న్యూ ఎడ్యుకేషన్‌ పాలసీని రద్దుచేయాలని పార్లమెంట్‌ సమావేశాలలో మాట్లాడాలని కోరుతూ ఆదివారం పీడీఎస్‌యూ, పీవైఎల్‌ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పార్లమెంట్‌ సభ్యులు రఘరాంరెడ్డికి రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి అజాద్‌, పివైఎల్‌ జిల్లా కార్యదర్శులు రాకేష్‌, వెంకటేష్‌ మాట్లాడారు. తక్షణమే పెండింగ్‌లో ఉన్న మెస్‌ చార్జీలు, స్కాలర్‌ షిప్స్‌ విడుదల చేయాలనీ గత ప్రభుత్వం విద్యా వ్యవస్థలో చేసిన ఇలాంటి తప్పిద్దాలు చేయకుండా ఉండటం తో పాటు జిల్లా విద్యారంగ అభివద్ధి కోసం జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటుకు కషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్‌, పివైఎల్‌ గొడ్డెటి అశోక్‌, నాయకులు ప్రసాద్‌, శ్రీను, స్టాలిన్‌, వెంకటేష్‌, రాకేష్‌ భరత్‌ తదితరులు పాల్గొన్నారు.
విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలి
ఖమ్మం జిల్లా కేంద్రంగా ప్రభుత్వ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని గిరి ప్రసాద్‌ భవన్‌కు విచ్చేసిన ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామ సహాయం రఘురాంరెడ్డికి ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా సమితి ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి ఇటికాల రామకష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్‌ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఖమ్మం కేంద్రంలో యూనివర్శీటీ ఎర్పాటు చేస్తామని హామీ ఇచ్చిందని తక్షణమే యూనివర్శీటీ ఏర్పాటు కు జిల్లా మంత్రులు చొరవ తీసుకొని హామీని నెరవేర్చలని అయన డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మధు, శివ నాయక్‌, జిల్లా నాయకులు రాకేష్‌, రాజు, ప్రతాప్‌, రోహిత్‌, ప్రభాస్‌, నరేష్‌, సాయి తదితరులు పాల్గొన్నారు.
బచ్చోడు గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలి
తిరుమలాయపాలెం : 28 గ్రామపంచాయతీలకు సెంటర్‌గా ఉన్న బచ్చోడు గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని సీపీిఐ ఎంఎల్‌ మాస్‌ లైన్‌ జిల్లా కార్యాలయంకు ఆదివారం ఎంపీ రఘురాంరెడ్డికి ఆదివారం ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు వినతి పత్రం అందజేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరు నెలల లోపులే బచ్చోడు గ్రామాన్ని మండల కేంద్రం చేస్తానని హామీ ఇచ్చారని ఆయన ఎంపీ రఘురాంరెడ్డికి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్‌ మాస్‌ లైన్‌ జిల్లా కార్యదర్శి గోకినపల్లి వెంకటేశ్వరరావు, రాయల చంద్రశేఖర్‌, గుర్రం అచ్చయ్య, ఆవుల అశోక్‌, బందెల వెంకయ్య, కమ్మ కోమటి నాగేశ్వరరావు, రేపాకుల శివలింగం, టీ.ఝాన్సీ, రాయల రవికుమార్‌, తిమ్మిడి హనుమంతరావు, సోమనపల్లి వెంకటేశ్వర్లు, ఆజాద్‌ రాకేష్‌ తదితరులు పాల్గొన్నారు.