– విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
– టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.రాజు
నవతెలంగాణ-కొత్తగూడెం
గిరిజన సంక్షేమ శాఖలో బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ వెంటనే విడుదల చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.రాజు డిమాండ్ చేశారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యూటీఎఫ్ టీచర్స్ భవన్లో బి.కిశోర్సింగ్ అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో బి.రాజు పాల్గొని మాట్లాడారు. గిరిజన సంక్షేమ శాఖలో బదిలీలు పదోన్నతుల కోసం ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్నారని, విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటికీ ఆ శాఖ ఉన్నతాధికారులు ఇంకా బదిలీల షెడ్యూల్ విడుదల చేయకపోవడంపై ఉపాధ్యాయులు ఆందోళనగా ఉన్నారని తెలిపారు. వెంటనే షెడ్యూల్ విడుదల చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది పండిట్, పీఈటీ పోస్టులు అప్గ్రేడ్ అయ్యి పదోన్నతులు పొంది పండగ వాతావరణం తలపిస్తుంటే గిరిజన సంక్షేమ శాఖలో పండిట్, పీఈటీ పోస్టులు అప్గ్రేడ్ కాకపోవడం చాలా బాధాకరమన్నారు. గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న పండిట్, పీఈటీ పోస్టులను అప్గ్రేడ్ చేసి వారికి పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. 2012, 2013లో ఏర్పాటు అయిన కన్వర్టెడ్ ఆశ్రమ పాఠశాలలు ప్రారంభించి 11 సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ ఒక్క పోస్ట్ మంజూరు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 15 సంవత్సరాలుగా సిఆర్టిలు శ్రమ దోపిడీకి గురి అవుతున్నారు. వీరి సర్వీస్లను రెగ్యులరైజేషన్ చేసే అవకాశం ఉన్నప్పటికీ చేయడం లేదు. సంక్షేమ రంగంగా పాలకులు చెప్పుకుంటున్న గిరిజన సంక్షేమ శాఖ పట్ల సవతితల్లి ప్రేమను ప్రదర్శించడం సరికాదని మండిపడ్డారు. తక్షణమే బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ ప్రకటించాలని, పండిట్, పీఈటి పోస్ట్లు అప్ గ్రేడ్ చేసి పదోన్నతులు కల్పించాలని, కన్వర్టెడ్ ఆశ్రమ పాఠశాలలకు పోస్టులు మంజూరు చేయాలని, ప్రాథమిక పాఠశాలల్లో ఎస్జీటీలకు హెచ్ఎం పోస్టులు మంజూరు చేసి పదోన్నతులు కల్పించాలని, సీఆర్టిల సర్వీసును క్రమబద్ధీ కరించాలని, 317 జీవో ద్వారా నష్టపోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కోరారు. పెండింగ్లో ఉన్న డీఏలను వెంటనే మంజూరు చేయాలని, పీఆర్సి నివేదిక తెప్పించుకొని మెరుగైన ఫిట్మెంట్తో అమలు చేయాలని, మిగిలిన ఖాళీలకు పదోన్నతులు నిర్వహించాలని, మిగిలిన ఖాళీల్లో మ్యూచువల్ వారికి అవకాశం కల్పించి బదిలీలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. అన్ని ఆసు పత్రులలో చెల్లుబాటు అయ్యే విధంగా హెల్త్ కార్డులు అమలు చేయాలని, 317జీవో బాధితుల సమస్యల ను పరిష్కరించి వారి వారి స్థానిక జిల్లాలకు కేటార ుుంపులు చేయాలని, బదిలీలు, పదోన్నతుల్లో నష్టం జరిగిందని అప్పీలు చేసుకున్న బాధితులందరికీ న్యాయం చేయాలని కోరారు. పాఠశాలల్లో స్వచ్ఛ కార్మికులను నియమించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.కృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు వి.వరలక్మి, బి.మురళి మోహన్, రాష్ట్ర ఆడిట్ కమిటీ మెంబెర్ జిల్లా కోశాధికారి యస్.వెంకటేశ్వర్లు, (ఎస్వి) రాష్ట్ర కమిటీ సభ్యులు పద్మారాణి, జిల్లా కార్యదర్సులు ఎం.రాజయ్య, హతీ రామ్, జయరాజు, విజరు, రాము, రమేష్ కుమార్, గంగాధర్, దాసు, బిక్.జిల్లా ఆడిట్ కమిటీ మెంబెర్స్ పాషా, రాజేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.