నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండల కేంద్రంలోని నర్సరిలో ఉపాదీహమీ పథకంలో పెంపకం చేపట్టిన నర్సరీలోని మెుక్కలను ఎంపీడీఓ శ్రీనివాస్ స్థానిక సిబ్బందితో కలిసి సోమవారం నాడు సందర్శించి పంపిణీ చేసారు. ఈ సంధర్భంగా పెంచిన మెుక్కలను గ్రామాలలో ఇంటింటికీ పంపిణీ చేసేందుకు సిద్దం చేసి తరలించారు. ప్రతి ఒక్కరు ఆరు మెుక్కలను పెంచాలని మండల ప్రజలకు సూచిమచారు. బాధ్యత తీసుకుని పెరట్లో, ఖీలీ స్థలాలలో పెంపకం చేపట్టాలని, గ్రామాలలో అవగాహన చేయీలని జీపీ కార్యదర్శులకు ఇటివలే ఆదేశాలు జారీ చేసినట్టు ఎంపీడీఓ శ్రీనివాస్ తెలిపారు. ఆయన వెంట స్థానిక సిబ్బంది, తదితరులు పోల్గోన్నారు.