కార్మికులు,కర్షకులుఉద్యమాలకు సిద్ధం కావాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి అన్నారు.సోమవారం మండలంలోని కల్వకుంట్ల గ్రామంలో నిర్వహించిన మునుగోడు నియోజకవర్గ శిక్షణ తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ క్లాసులకు ప్రిన్సిపాల్ గా బండ శ్రీశైలం అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో రేవంత్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని, ప్రభుత్వం మీద ఒత్తిడితీసుకొచ్చే విధంగాపోరాటాలు నిర్వహించాలన్నారు. గ్రామస్థాయి నుండి ప్రజలను చైతన్యపరిచి పోరాటాల వైపుమళ్ళించాలన్నారు. ప్రభుత్వ నూతన ఆర్థిక విధానాల వ్యతిరేకంగా, పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా, మతోన్మాదానికి వ్యతిరేకంగ కమ్యూనిస్టు కార్యకర్తలుపోరాటాలకు సిద్ధం కావాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా లక్షలలో ఉద్యోగాలు ఇస్తానని, ఇవ్వకపోగాప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడానికి ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. విద్యుత్ సంస్కరణ చట్టం రద్దు చేయాలని,కార్మిక చట్టాలను యధావిధిగా ఉంచాలని, రైతులు పండించిన పంటలకు వ్యవసాయ పెట్టుబడి మీద 50% పెంచి మద్దతు ధరల చట్టం పార్లమెంట్లో చేయాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంఎన్నికల ముందుఎన్నో వాగ్దానాలు చేసి, ఇప్పటివరకు అమలు చేయకపోవడం చాలా దుర్మార్గమని అన్నారు. నక్కల గండి, డిండి ఎత్తిపోతల పథకం పనులనువేగవంతం చేయాలని, ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం నుండి మిగిలిన 14 కిలోమీటర్ల సొరంగ మార్గానికి రెండు వేల కోట్లు కేటాయించి,పనులు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సర్వీస్ రోడ్లను, మురికి కాల్వలను, మరుగుదొడ్లను నిర్మాణం చేయాలనిపల్లె వెలుగు బస్సులనుగ్రామీణ ప్రాంతాలకు యధావిధిగా నడపాలని కోరారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు చాపల మారయ్య, నాంపల్లి చంద్రమౌళి, డివైఎఫ్ఐ రాష్ట్ర నాయకులు అయిత గోని విజయకుమార్, మండల కార్యదర్శులుమిర్యాల భరత్, ఏర్పుల యాదయ్య, సహాయ కార్యదర్శులు వరికుప్పల ముత్యాలు, జెర్రి పోతుల ధనంజయగౌడ్, నారగోని నరసింహ, జిఎంపిస్ జిల్లా అధ్యక్షులుసాగర్ల మల్లేష్,రైతు సంఘం నాయకులు వేముల లింగస్వామి, అచ్చిన శ్రీనివాస్, ఖమ్మం రాములు, వల్లూరి శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.