కలెక్టర్ ఆదేశాలు భే ఖాతరు..

– వెలవెల బోయిన ప్రజావాణి
– అధికారులు డుమ్మా
– మండలం లో అంతా ఇంచార్జి లే…
నవతెలంగాణ – పెద్దవూర
మండల కేంద్రం లోని ప్రజాపరిషత్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజావాణి అధికారులు లేక వెలవెల బోయింది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టత్మాకంగా చేపట్టిన ప్రజావాణి కార్యక్రమానికి అన్నిశాఖల అధికారులు హాజరు కాక నామ మాత్రంగా జరిగింది. మొట్టమొదటి ప్రజావాణి లో కుర్చీలు నిండిపోయి సజావుగా జరిగింది. కాని రెండో ప్రజావాణి సోమవారం అధికారులు లేక ఖాళీ కుర్చీలు కనిపిస్తూ వెల వెల బోయింది. పంచాయతీ, రేవున్యూ, ఐసీడీ ఎస్, పశుసంవర్థక శాఖ, ఆరోగ్య శాఖ, ఆర్ అండ్ బీ, విద్యాశాఖ, ఉపాధి హామీ, మహిళా సమాఖ్య, ఇరిగేషన్, అగ్రికల్చర్, ఐసీఐడీస్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ట్రాన్ స్కో,ఏఈ, శాఖల అధికారులు అందరూ హాజరు కావాల్సింది వుంది. కానీ ఐసీడీఎస్ నుంచి ఇద్దరు సూపర్ వైజర్లు, అగ్రికల్చర్ ఏఓ, కార్యదర్శులు 15 మంది, వారిలో కొందరు ఆఫస్ కు సంబందించిన పనులు పూర్తి చేసుకొని 12.19 నిముషాలకు ప్రజావానిలో పాల్గొన్నారు. ఏఈఓ,వ్యవసాయ విస్తరణ అధికారులు 05 గురు, మండల పశు వైధ్యాధికారి, ఆర్ డబ్లయ్యు ఏఈ,ఇంచార్జి ఎంపీడీఓ, తహసీల్దార్, ఏపీఓ, ఎంపీడిఓ కార్యక్రమంలో సీనియర్, జూనియర్ అసిస్టెంట్ లు మినహా ఎవరు హాజరు కాలేదు. సమస్య లను మానవతా దృక్పథంతో చూడాలని క్షేత్రస్థాయిలో సమస్యలకు పరిష్కారం చేయాలని, అర్జీ పెట్టిన సమస్య వెంటనే పరిష్కరించెవి ఉంటే వాటిని చూడాలని, అలాగే అర్జీ పెట్టిన 15 రోజుల్లోగా సమస్య పరిష్కారం చేయాలని, మండలం లో పరిష్కారం కానీ సమస్యలు జిల్లా కేంద్రంలో పరిష్కరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ప్రజా వాణికి మండలం లోని అన్ని శాఖల అధికారులు హాజరు కావాలని ఆదేశించినా కలెక్టర్ ఆదేశాలు కొంతమంది అధికారులు భే ఖాతార్ చేశారు. ప్రజావాణికి హాజరు కాక మండలం లో సోమవారం జరిగిన ప్రజా వాని వెల వెల బోయి నామ మాత్రంగా జరిగింది. మండలం లో మొత్తం 36 మంది తమ సమస్యలు గురించి అప్లై చేసుకున్నారు. అందులో ఎంపీడీఓ కార్యాలయానికి 20, తహసీల్దార్ కార్యాలయానికి 04, మిగిలిన వివిధ శాఖలకు అర్జీ పెట్టుకున్నారు.
సంబందిత అధికారులకు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చాము: ఇంచార్జి ఎంపీడీఓ..మహ్మద్ హపీజ్ ఖాన్..
సోమవారం మండల కేంద్రం లో ప్రజావాణి కార్యక్రమానికి ప్రతి మండల అధికారి హాజరు కావాలని తెలిపాము. కొంతమంది సమాయానికి వచ్చారు. మరికొంత మంది తరువాత వచ్చారు. వారి వారి కార్యాలయాలలో ఎమర్జెన్సీ పనులు ఉంటే త్వరగా పూర్తిచేసి వెళ్ళాలని కలెక్టర్ చెప్పారని తెలిపారు. అందుకే సమయాను కులాంగా ప్రజా వానికి రాలేక పోయారని తెలిపారు.