రాష్ట్ర ప్రభుత్వా రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జులై 15 (సోమవారం) నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పెన్షనర్ల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలంగాణ ఆల్ పెన్షనర్స్& రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యవర్గం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం జిల్లా అధ్యక్షులు కే. రామ్మోహన్రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పెండింగ్ లో ఉన్న నాలుగు డిఏలను తక్షణమే విడుదల చేయాలని, నగదు రహిత వైద్యాన్ని అన్ని కార్పోరేట్, ప్రైవేటు ఆసుపత్రులలో అనుమతించాలని, డిమాండ్ చేస్తూ ఈ ధర్నాను నిర్వహిస్తున్నట్లు నిజామాబాద్ డివిజన్ అధ్యక్షులు సిర్పా హనుమాన్లు తెలిపారు. 30% ఫిట్మెంట్ తో పే డివిజన్ కమిషన్ ని విడుదల చేయాలని, ఇంకా పెండింగ్ లో ఉన్న పలు సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు చేపట్టాలని కార్యవర్గం తీర్మానించింది. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సుదం మధుసూదన్, జిల్లా నాయకులు ఈవీఎల్ నారాయణ, లావు వీరయ్య, బట్టి గంగాధర్, భోజరావు, బన్సీలాల్, రాజేందర్, రాధాకృష్ణ, ప్రసాదు, పురుషోత్తం బోధన్ డివిజన్ అధ్యక్షులు కృష్ణారావు, ఆర్మూర్ డివిజన్ అధ్యక్షులు బాబా గౌడ్, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.