డివిజన్ కార్యాలయంలో “విద్యుత్ ప్రజావాణి” కార్యక్రమం..

నవతెలంగాణ – డిచ్ పల్లి

డిచ్ పల్లి డివిజన్ కార్యాలయంలో విద్యుత్ ప్రజావాణి కార్యక్రమం లో భాగంగా సోమవారం సిరికోండ మండలంలోని కొండూర్ గ్రామంలో రైతులు 100 కేవీ ట్రాన్స్ఫార్మర్ పై ఎక్కువ మోటార్లు ఉండటం వలన, ట్రాన్స్ఫార్మర్ మీద తరచుగా సమస్యలు తలెత్తుతున్నాయని డిచ్ పల్లి డివిజనల్ ఇంజనీర్ ఉత్తమ్ జాడే కి విన్నవించారు. క్షేత్ర స్థాయి అధికారులను పంపించి పరిశీలన చేసి తగ్గు చర్య తీసుకుంటామని వినియోగదారులకు తెలిపారు.