ప్రజావాణిలో 11 దరఖాస్తులు..

నవతెలంగాణ – పెద్దకొడప్ గల్

మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో సోమవారం రోజు జరిగిన ప్రజావాణిలో 11 దరఖాస్తులు వచ్చాయిపట్ట భూముల్ని పార్ట్ బి నుంచి తొలగించండి సార్ అని మండల కేంద్రంలోని బేగంపూర్ గ్రామానికి చెందిన రైతులు ప్రజావాణిలో ఎమ్మార్వో దశరథ్ ను వినతి పత్రం అందజేశారు.. బేగంపూర్ గ్రామ శివారులోని 104 సర్వే నంబర్లో గల భూమి గత 70 సంవత్సరాల నుంచి పట్టా భూమిగా కొనుగోలు చేశామని తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన పాస్ బుక్ ఉన్నాయని రైతుబంధు కూడా తీసుకున్నామని సూచించారు. రెవిన్యూ, ఫారెస్ట్ రికార్డులలో అడవి భూమి అని ఎక్కడా రికార్డు లో  లేదని సూచించారు. ఈ భూమి ఎలా పార్ట్ బి లో ఉంచుతారని రైతులు ఎమ్మార్వో దశరత్ ను రాతపూర్వకంగా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.ఈ సమస్యను తీర్చి న్యాయం చేయాలని కోరారు.అనంతరం ప్రజావాణిలో సోమవారం11దరఖాస్తులు వచ్చాయని ఎమ్మార్వో దశరథ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ ఎంపీడీవో సూర్యకాంత్, ఏఈఓ రూప, అధికారులు పాల్గొన్నారు