ఈ శోకానికి కారకులెవరు?

ఈ శోకానికి కారకులెవరు?మనిషి గ్రహాల స్థితిగతులను లెక్కిస్తూ..
కృత్రిమ గ్రహాలను సృష్టిస్తూ..
అంతరిక్షపు అంచుల్ని,
కడలి లోతుల్ని చేదిస్తూ..
భవిష్యత్తు ఫలితాల కోసం
మూఢనమ్మకాలైన
అదృష్టం, అంధ విశ్వాసాల
ఛాందస ఆలోచనల భ్రమలో పడి
”భోలే బాబా పాద ధూళికై” పాకులాడి
వంద మందికి పైన ప్రాణాలు మట్టిలో కలిసే..
ఇంకా క్షతగాత్రులెంతమందో..!
ఈ శోకానికి ఎవరు బాధ్యులు? శిక్ష ఎవరికి!
కంప్యూటర్‌ కాలంలో
పాత రాతియుగపు ప్రవర్తనలా..
ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?
పాలకులు, పాలితులు వైజ్ఞానిక దృష్టితో
అభ్యుదయ భావాలతో
చైతన్యవంతులు
కాకపోతే? ఇంతే..
యదా రాజా.. తదా ప్రజా
అనేది పాత పాట
యదా పాలక తదా పాలిత
అనేది సరికొత్త రాగం..
సామాజిక రుగ్మతల
చీడపీడ నిర్మూలించేందుకు
మరో పోరాటం చేయాల్సిందే..
– మేకిరి దామోదర్‌,
9573666650