ఎన్‌ఎస్‌ఇఎఫ్‌ఐతో సర్వోటెక్‌ పవర్‌ జట్టు

న్యూఢిల్లీ : నేషనల్‌ సోలార్‌ ఎనర్జీ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌ఎస్‌ఇఎఫ్‌ఐ)తో సర్వోటెక్‌ పవర్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ జట్టు కట్టింది. ఇందులో భాగంగా ఢిల్లీలో తొలి గ్రిడ్‌ కనెక్ట్‌ చేయబడిన సోలార్‌ పవర్డ్‌ ఇవి ఛార్జింగ్‌ కార్‌పోర్ట్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. పైలట్‌ ప్రాజెక్ట్‌గా హౌజ్‌ ఖాస్‌ విలేజ్‌ పార్కింగ్‌ స్టేషన్‌లో దీన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. సర్వోటెక్‌ పవర్‌ సిస్టమ్స్‌ వ్యవస్థాపకులు రామన్‌ భాటియా, ఎండి అమర్జీత్‌ సింగ్‌ దీన్ని ప్రారంభించారు. కార్‌పోర్ట్‌ను స్థాపించడానికి ఉపయోగించే సోలార్‌ ప్యానెల్‌లు, ఇవి ఛార్జర్‌లను సర్వోటెక్‌ తయారు చేసింది.