హైదరాబాద్ : ప్రముఖ ఎఫ్‌ఎంసిజి బ్రాండ్ ఐటిసి తక్కువ కొలెస్ట్రాల్‌తో కొత్తగా ఆశీర్వాద్ స్వాస్తి నెయ్యిని విడుదల చేసినట్లు తెలిపింది. మంచి సువాసన, రుచితో పాటు సాధారణ అవు నెయ్యి కంటే 90 శాతం తక్కువ కొలెస్ట్రాల్‌తో ఇది లభిస్తుందని ఆ కంపెనీ మార్కెటింగ్ హెడ్ అభిషేక్ మెహరోత్ర తెలిపారు. ఆరోగ్యానికి సంబంధించిన కొలెస్ట్రాల్ ఆందోళనలు కలిగిన వినియోగదారులు తమకు ఇష్టమైన వంటకాల్లోనూ దీన్ని ఉపయోగించవచ్చన్నారు. కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి ఆధునిక ప్రక్రియను వినియోగించామన్నారు.