
తెలంగాణా రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టిన ఈరవత్రి అనిల్ కు మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంకేట రవి ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. బాల్కొండ నియోజకవర్గానికి చెందిన నాయకులకు కార్పొరేషన్ పదవులు వరించడం పట్ల ఈ సందర్భంగా సుంకేట రవి వ్యక్తం చేశారు. ఈరవత్రి అనిల్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉప్లూర్ మాజీ సర్పంచ్ బద్దం రమేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పిరెడ్డి శ్రీనివాస్, మైనార్టీ సెల్ జిల్లా నాయకులు అబ్దుల్ రఫీ, తదితరులు ఉన్నారు.