నేడు తెరుచుకోనున్న అశ్వారావుపేట ఆయిల్ ఫాం పరిశ్రమ..

– గెలలు తరలించాలని రైతులకు విజ్ఞప్తి..
నవతెలంగాణ – అశ్వరావుపేట
ఆయిల్ఫెడ్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయిల్ ఫాం పరిశ్రమను బుధవారం నుండి తెరవ నున్నట్లు పరిశ్రమ మేనేజర్ ఎం.నాగబాబు మంగళవారం తెలిపారు. ఈ ఏడాది అననుకూల వాతావరణ పరిస్థితుల్లో గెలలు దిగుబడి తక్కువ రావడం తో ఈ పరిశ్రమను మే 1 న నిలుపుదల చేసారు. నాటి నుండి ఈ ప్రాంతం రైతులు గెలలు ను దమ్మపేట మండలం అప్పారావు పేట పరిశ్రమకు తరలిస్తున్నారు. గెలలు దిగుబడి సీజన్ జులై ఒకటి నుండి ప్రారంభం కావడంతో పాటు వర్షాలు సైతం అడపా దడపా పడుతుండటంతో గెలలు శీఘ్రగతిన ఫలదీకరణం చెందే నేపధ్యంలో ఈ నెల 10 నుండి పరిశ్రమలో గెలలు క్రసింగ్ ప్రారంభిస్తామని,ఈ ప్రాంతం రైతులు ఇంకా నుండి ఈ పరిశ్రమకే గెలలు తరలించాలని విజ్ఞప్తి చేసారు.