వ్యాపార అభివృద్ధి మెలకువలు తెలుసుకోవాలి..

నవతెలంగాణ – డిచ్ పల్లి
వ్యాపార అభివృద్ధి కోసం మెలకువలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఐకేపీ డీపీఎం సాయిలు అన్నారు. మంగళవారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి సంస్థ అధ్వర్యంలో ఉడిపి ఇంట్రిప్రెరేన్ షిప్  డెవలప్ మెంట్ ప్రొగ్రాం శిక్షణా కార్యక్రమం ప్రారంభించారు. ఈసందర్భంగా డీపీఎం సాయిలు  మాట్లాడుతూ.. ఈ శిక్షణా  వ్యాపారం లో  మహిళలు అభివృద్ధి చెందడానికి  చాలా ఉపయోగకరంగా ఉంటుందని, ఇంట్లో ఉంటునే వ్యాపారం చేసుకొని అభివృద్ధి చెందాలని, తమ కాళ్ళమీద నిలబడి ఎదగడానికి చాలా చక్కని అవకాశం అర్ ఎస్ ఈ టి ఐ లో శిక్షణ చాలా బాగా నాణ్యతతో నేర్పిస్తున్నారని వివరించారు. ఈ సంస్థలో నేర్చుకున్న ఎంతో మంది మహిళలు జీవితం లో  స్థిరపడ్డారని పేర్కొన్నారు. ప్రస్తుతం స్కూలు డ్రెస్ లు కుట్టడం అనేది చాలా మంచి అవకాశమని, మహిళలకు పని దురుకుతుందని ఈ శిక్షణలో స్కూలు డ్రెస్ లు కటింగ్, కుట్టడం సూచిస్తారని వివరించారు. ఈ కార్యక్రమం లో డైరెక్టర్ సుంకం శ్రీనివాస్, సిబ్బంది భాగ్యలక్ష్మి, రామకృష్ణ, నవీన్, రంజిత్, తోపాటు  పాల్గొన్నారు.