పీఎం విశ్వకర్మ దరఖాస్తు దారులకు ప్రశంస పత్రాలు అందజేత

నవతెలంగాణ –  రెంజల్ 

ఇటీవల కేంద్ర ప్రభుత్వం పీఎం విశ్వకర్మ పథకం కింద దరఖాస్తులు చేసుకోవాలని ఆదేశాలు రావడంతో రేంజల్ మండలం పేపర్ మిల్ లోని కామన్ సర్వీస్ సెంటర్ లో సుమారు 42 మంది లబ్ధిదారులు దరఖాస్తులు చేసుకోగా వారికి ప్రశంస పత్రాలతో పాటు ఐడి కార్డు అందజేయడం జరిగిందని కేంద్ర ప్రభుత్వం కామన్ సర్వీస్ సెంటర్ అధినేత ముఖిద్ పేర్కొన్నారు. వివిధ గ్రామాల నుంచి పీఎం విశ్వకర్మ పథకానికి దరఖాస్తులు చేసుకున్న 42 మందికి త్వరలో నిజామాబాద్ లో మూడు రోజులు శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేసి వారికి శిక్షణను ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. శిక్షణ కాలంలో వారి బ్యాంకు ఖాతాలో 4000 రూపాయలకు ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. విశ్వ కర్మ సామాగ్రికి 14 వేల రూపాయలు ఇవ్వడమే కాకుండా వారికి ఉపాధి కోసం లక్ష రూపాయల రుణాన్ని అందజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. దరఖాస్తులు చేసుకునే లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సభ్యులు చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సర్వీస్ సెంటర్ యజమాని ముకీద్, అవేజ్, స్థానిక యువత, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.