విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సెమిస్టర్ ను వాయిదా వేయాలి

నవతెలంగాణ – డిచ్ పల్లి 

తెలంగాణ యూనివర్సిటీ లో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 15 న ప్రారంభిస్తున్నారని, ఇదే నెలలో డీఎస్సీ ని 18 నుంచి ఆగస్టు 5వ  వరకు పరీక్షలు ఉన్నాయని విటన్నింటిని దృష్టి లో ఉంచుకొని పరిక్షలను వాయిదా వేయాలని  తెలంగాణ యూనివర్సిటీ ఎన్ ఎస్ యు ఐ, గిరిజన శక్తి ఆధ్వర్యంలో మంగళవారం యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం యాదగిరి కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యూనివర్సిటీలో చాలామంది నిరుద్యోగ విద్యార్థులు డీఎస్సీ పరీక్షల కోసం సిద్ధం అవుతున్నారని, యూనివర్సిటీ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని వారు కోరారు.విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తిసుకోవలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యుఐ యూనివర్సిటీ అధ్యక్షులు శ్రీ శైలం, గిరిజన శక్తి శ్రీను రాథోడ్, యూనివర్సిటీ విద్యార్థులు మహేష్, హరిత, సౌందర్య, రమ్య తదితరులు పాల్గొన్నారు.