
– రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఎములాడ, కొండగట్టు, ఇల్లందకుంట ఆలయాలను అభివ్రుద్ధి చేస్తా..
– రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి అభివ్రుద్ధి చేసుకుందాం..
– వేములవాడ ‘కృతజ్ఝత’ సభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్..
నవతెలంగాణ – వేములవాడ
‘‘నేను మీరు తయారు చేసిన కార్యకర్తను. కింది స్థాయి నుండి ఎదిగిన వ్యక్తిని. మీకు ఏ కష్టమొచ్చినా అండగా ఉంటా.. నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించిన వేములవాడ నియోజకవర్గ ప్రజలకు, కుల సంఘాల నాయకులకు రెండు చేతులు జోడించి ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నా.. మీకు సేవ చేయడం నేను బాధ్యతగా భావిస్తానే తప్ప ఎన్నడూ అధికారం ఉందని అహంకారంతో వ్యవహరించను.. నా బాధ్యతను ఎన్నడూ మీపై పెట్టను. కానీ మీ బాధ్యతలను నేను మోసేందుకు సిద్ధంగా ఉన్నా’’అని ’’అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.. మంగళవారం వేములవాడ నియోజకవర్గ అభివ్రుద్ధికి ఎక్కువ నిధులు తీసుకొచ్చి అన్ని విధాలా అభివ్రుద్ధి చేసేందుకు సిద్ధమని, ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివ్రుద్ధి చేసుకుందామని కోరారు. కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించిన వేములవాడ నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఝతలు తెలిపేందుకు వేములవాడ పట్టణంలోని భీమేశ్వర గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన సభకు బండి సంజయ్ హాజరై వివిధ కుల, వ్రుత్తి సంఘాల నాయకులను సన్మానించారు.. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ..నన్ను భారీ మెజారిటీతో గెలిపించిన మీ అందరికీ రెండు చేతులు జోడించి ధన్యవాదాలు చెబుతున్నా, నరేంద్రమోదీని ప్రధానమంత్రిని చేయడంలో మీ అందరి భాగస్వామ్యం ఉంది అని అన్నారు. మీరు నన్ను గెలిపిస్తే నేను మీ తరపున మోదీకి ఓటేసిన, మీరు భారీ మెజారిటీతో గెలిపించినందునే నన్ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బాధ్యతలు అప్పగించారు అని వెల్లడించారు. మీ నమ్మకాన్ని నేను ఎన్నడూ వమ్ము చేయను,కొన్ని పార్టీలకు బాంబు పేలుళ్లు లేవని, అర్ధరాత్రి నక్సలైట్ల హత్యల్లేవని బోర్ కొడుతోందట అవేమీ లేకుండా చేసిన వ్యక్తి మోదీ అని తెలిపారు. ఒకవేళ మోదీ ప్రభుత్వం లేకుంటే 370 ఆర్టికల్ రద్దు చేసే సాహసం ఎవరూ చేసేవాళ్లు కారు మొన్నటి వరకు పార్లమెంట్ చేసే చట్టాలు జమ్మూకాశ్మీర్ లో వర్తించేవికావు.
భారతీయ జెండా ఎగిరేది కాదు.. అందుకే 370 ఆర్టికల్ ను రద్దు చేసినం అని అన్నారు. అక్కడ అభివ్రుద్ధి శరవేగంగా జరుగుతోంది అయోధ్యలో రామ మందిర నిర్మాణం మోదీ సర్కార్ తోనే సాధ్యమైంది అని వెల్లడించారు. ఎన్నికల వరకే రాజకీయాలు ఎన్నికల తరువాత అభివ్రుద్ధి, ప్రజా సంక్షేమమే బీజేపీ ధ్యేయం అని తెలిపారు. కేంద్రం వేములవాడ ఆలయాన్ని అభివ్రుద్ధి చేసేందుకు సానుకూలంగా ఉన్నా గత బీఆర్ఎస్ ప్రభుత్వం సహకరించలేదు, ఈసారి నేను కేంద్ర మంత్రినయ్యాను. వెంటనే రాజన్న ఆలయ అభివ్రుద్ధి కోసం కేంద్ర పర్యటన, సాంస్క్రుతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కలిసిన. ఆయన కూడా సానుకూలంగా ఉన్నారు అని తెలిపారు. నియోజకవర్గంలోని ఎమ్మెల్యేసహా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కొండగట్టు, రాజన్న ఆలయాలను అభివ్రుద్ధి చేసి తీరుతా. ఈ విషయంలో అందరూ కలిసి రావాలని కోరుతున్నా అని అన్నారు. నేను మీరు తయారు చేసిన కార్యకర్తను.. కింది స్థాయి నుండి ఎదిగిన వ్యక్తిని.. మీకు ఏ కష్టమొచ్చినా అండగా ఉంటా.. మీకు చేదోడువాదోడుగా ఉంటా.. మీకు సేవ చేయడం నేను బాధ్యతగా భావిస్తానే తప్ప ఎన్నడూ అధికారం ఉందని కానీ మీ బాధ్యతలను నేను మోసేందుకు సిద్ధంగా ఉన్నా అని అన్నారు. వేములవాడ నియోజకవర్గ అభివ్రుద్ధికి ఎక్కువ నిధులు తీసుకొచ్చి అభివ్రుద్ధి చేస్తాఅందరం కలిసి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివ్రుద్ధి చేసుకుందాం అని కోరారు.
మున్నూరుకాపు సంఘ భవన నిర్మాణానికి భూమి పూజ..
వేములవాడ నియోజకవర్గ పర్యటనలో భాగంగా పట్టణంలో మున్నూరుకాపు సంఘం భవన నిర్మాణానికి సంబంధించి భూమి పూజలో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బండి సంజయ్ మాట్లాడుతూ… ‘‘జై శ్రీరామ్ అనేటోల్లు నిజమైన మున్నూరు కాపులు ఇయాళ మున్నూరు కాపు సంఘ భవన నిర్మాణానికి శంఖుస్థాపన చేయడం సంతోషంగా వుంది అని అన్నారు. సంఘ భవన నిర్మాణం కోసం నా వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. మీరంతా కష్టపడి పనిచేసినందుకే నేను గెలిచి మంత్రి ని అయ్యాను అని తెలిపారు. నా గెలుపుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా సహకరించారు. నాకు భారీ మెజారిటీ అందించిన వేములవాడ ప్రజల అభివ్రుద్ధి కోసం పని చేస్తా, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సహకారంతో వేములవాడ నియోజకవర్గ అభివృద్ధికి పనిచేస్తాఅని తెలిపారు. నేను అన్ని కుల సంఘాలకు నిధిలిచ్చిన దయచేసి రాజకీయ పార్టీలకు సంబంధం లేని వ్యక్తులను కుల సంఘాల బాధ్యతలు అప్పగించాలి పొరపాటున పార్టీలు జొరబడితే కుల సంఘాలు చీలే ప్రమాదముంది అని అన్నారు. అందరి సహకారంతో కుల సంఘాలు అభివృద్ధి కావాలిఅని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు చెన్నమనేని వికాస్, జిల్లా అధ్యక్షుడు ప్రతాప్ రామకృష్ణ, పార్టీ మున్సిపల్ చైర్మన్ మాధవి,వైస్ చైర్మన్ బింగి మహేష్,సెస్ డైరెక్టర్ నామాల ఉమా, బిజెపి రాష్ట్ర నాయకులు ఎర్ర మహేష్, మున్నూరు కాపు సంఘ సభ్యులు తో పాటు తదితరులు పాల్గొన్నారు.