– బండ లేమూర్ మాజీ సర్పంచ్ పోచమోనీకృష్ణ
– స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు చొరవ తీసుకోవాలి
నవతెలంగాణ-మంచాల
బండ లేమూర్ పోర్లగడ్డ తండ రోడ్డు మిగిలిపోయిన పనులను పూర్తి చేయాలని బండ లేమూర్ మాజీ సర్పంచ్ పోచమోనీ కృష్ణ ప్రభు త్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మండల పరిధిలోని బండ లేమూర్ గ్రామంలో ఆయన మాట్లాడుతూ..బండ లేమూర్ పోర్లగడ్డ తాండ రోడ్డు రెండు జిల్లాలలోని ఇబ్రహీంపట్నం, నారా యణపురం గట్టుప్పల్, చౌటుప్పల్, మర్రిగూడ మండలాల్లో అనేక గ్రామాల ప్రజలకు రవాణా మార్గంగా ఉందని, ఈ రోడ్డు వెంట అర్‌టీసీ బస్సు లు కూడా నడుస్తుండడంతో ప్రజలకు రవాణా సౌకర్యం ఉందన్నారు. ఈ రోడ్డు మట్టి రోడ్డు కావ డంతో తరచుగా వర్షాలకు రోడ్డంతా మట్టి కొట్టుక పోయి గుంతలుపడి చెడిపోవడంతో వాహనాలు నడవలేక పోతున్నాయని రోడ్డు రిపేర్ చేయాల న్నారు. గత ప్రభుత్వాన్ని పలు మార్లు డిమాండ్ చ స్తే ప్రభుత్వం తాత్కాలిక నిర్మాణం కోసం రూ.24 లక్షలు మంజూరు చేశారన్నారు. మంజూరైన డబ్బుతో రోడ్డు పైన మట్టి పోయడం, మలుపులు ఉన్న దగ్గర సీసీరోడ్డు వేయాల్సి ఉండగా ఈ పను లు చేపట్టిన కాంట్రాక్టర్ మట్టి పనులు చేసి రోడ్డు వేయలేదన్నారు. అలా చేయడం వల్ల ప్రస్తుతం కురిసిన వర్షంవల్ల మూల మలుపుల దగ్గర మట్టి కొట్టుకపోయిందన్నారు. దీంతో మళ్లీ ఆర్‌టీసీ అధి కారులు బస్సులు నిలిపి వేస్తామని అంటున్నారని తెలిపారు. ఒక వేళ బస్సులు నిలిపి వేస్తే గిరిజన తండాల ప్రజలకు ఇబ్బందులు ఎదుర్కొనే అవకా శం ఉందన్నారు. ఈ సమ స్యను గుర్తించిన కెలోత్ తండ గిరిజన నాయకులు దుద్యానాయక్ ముందు కు వచ్చి తన సొంత డబ్బులతో తాత్కాలికంగా రోడ్డుపై జేసీబీతో మట్టి పోయించారని తెలిపారు. కాబట్టి సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కాంట్రాక్టర్‌తో మిగిలిపోయిన పనులను చేయిం చాలన్నారు. ప్రజల రవాణా సౌకర్యానికి ఆటంకం కలుగకుండా చూడాలన్నారు. అలాగే రోడ్డుపై బీటీ రోడ్డు వేయించేందుకు స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు చొరవ చూపాలని కోరారు.న