– బదిలీ పై వెళ్లిన వారికి సన్మానం
– ఉపాధ్యాయులు వెళ్ళ వద్దంటూ గండిపేట్ స్కూల్లో రోదించిన చిన్నారులు
– కౌన్సిలర్ వల్కే విజేత ప్రశాంత్ యాదవ్
నవతెలంగాణ-గండిపేట్
60 మంది విద్యార్థుల నుండి 300 విద్యార్థులను పెంచిన ఉపాధ్యా యుల సేవలు మరువలేవని కౌన్సిలర్ విజేత ప్రశాంత్ అన్నారు. మంగళ వారం నార్సింగ్ మున్సిపాలిటీలోని గండిపేట్ మండల కేంద్రంలో ఉన్న ప్రభు త్వ పాఠశాల ఉపాధ్యాయులు బదిలీపై వెళ్లారు. బదిలీ పైన వెళ్లిన ఉపాధ్యా యులకు కౌన్సిలర్, కోఆప్షన్ సభ్యులు విద్యార్థులు వారి తల్లిదండ్రులకు సమక్షంలో వీడ్కోలు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ… ప్రభుత్వ పాఠశాలను కార్పొరేటు పాఠశాలగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయుల సేవలు ఎప్పుడు మరువలేమన్నారు. బదిలీ పైన వెళ్లడం పట్ల ఉపాధ్యాయుల తల్లిదండ్రులు బాధపడుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులు వచ్చేందుకు నిత్యం కషి చస్తూ బిల్డింగ్ లేని పాఠశాలకు అందరి సహకారంతో కార్పొరేట్ పాఠశాలనుగా మార్చిన ఘనత వారిది అన్నారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు లేకుండా చేసిన ఘనత గండిపేట్ పాఠశాలలను తీర్చిదిద్దినట్లు తెలిపారు. విద్యార్థులకు సంవత్సరానికి సరిపడ నోట్ బుక్స్ సానిటరీ బ్యాగ్స్ అన్ని రకాల వసతులను కల్పించినట్లు తెలిపారు. ఉపాధ్యాయులు బదిలీపై వెళ్లడం పట్ల స్కూల్ చిన్నారులు వెళ్లవద్ద ని ఏడ్చారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు ప్రశాంతి యాదవ్, విద్యార్థు ల తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.