కార్మికులను ఇబ్బందులకు గురిచేయొద్దు

కార్మికులను ఇబ్బందులకు గురిచేయొద్దు– గనుల శాఖ సెక్రటరీ సురేంద్ర మెహన్‌, డైరెక్టర్‌ సుశీల్‌ కుమార్‌ను కలిసిన తాండూరు క్వారీ, స్టోన్‌ వేల్పర్‌ అసోసియేషన్‌ నాయకులు
నవతెలంగాణ-తాండూరు
కార్మికులను ఇబ్బందులకు గురిచేయొద్దని గనుల శాఖ సెక్రటరీ సురేంద్ర మెహన్‌, డైరెక్టర్‌ సుశీల్‌ కుమార్‌ను తాండూరు క్వారీ వేల్పర్‌, స్టోన్‌ మర్చంట్‌ వేల్పర్‌ అసోసియేషన్‌ నాయకులు కలిశారు. తాండూరు అంటేనే సుద్ద, నాపరాతి గనులకు పెట్టింది పేరు, అలాగే ప్రభుత్వంకు ఆదాయం సమకూర్చే దానిలో సుద్ద, నాపరాతి పరిశ్రమ ముందు వరుసలో ఉంటుందని చెప్పవచ్చు, అయితే గత పదేండ్లుగా ఈ పరిశ్రమలలో ఎక్కడి సమస్యలు అక్కడే తీష్టవేయడంతో దీనిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న ఎంతో మంది కార్మికుల కష్టాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గత అసెంబ్లీ సమావేశాల్లో స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌ రెడ్డి కర్ణాటక రాష్ట్రంతో పోలిస్తే తెలంగాణలో నాపరాతిపై అధిక రాయల్టీ వసూలు చేస్తున్నట్టుగా ప్రభుత్వం దష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి ఆదేశాలతో గనుల శాఖ సెక్రటరీ సురేంద్ర మెహన్‌, డైరెక్టర్‌ సుశీల్‌ కుమార్‌ గారి భేటీ అయిన క్వారీ, స్టోన్‌ వేల్పర్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు అబ్దుల్‌ రవూఫ్‌, నయీంఅప్పు ఈ సందర్భంగా అసోసియేషన్‌ సభ్యులు అధిక రాయల్టీ వసూలు చేయడం వల్ల సుద్ద, నాపరాతి పరిశ్రమ మనుగడ కష్టం అవుతుందన్నారు. ఇలానే కొనసాగితే భవిష్యత్తులో తాండూర్‌ ప్రాంతంలో ఈ పరిశ్రమలు కనుమరుగు అయ్యే అవకాశం ఉందని అధికారుల దష్టికి తీసుకువచ్చారు. ఈ పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వందలాది కుటుంబాలు ఉపాధి కోల్పోవడం తో పాటు, ప్రభుత్వంకు వచ్చే ఆదాయం తగ్గుతుందని మైన్స్‌ శాఖ అధికారుల దష్టికి తీసుకొచ్చారు. కర్ణాటక రాష్ట్ర తరహాలో రాయల్టీల విధానం అమలు చేయాలని అధికారులను కోరారు. ఈ ప్రాంతంలో గనులు, సుద్ద నాపరాతి పరిశ్రమలు అభివద్ధి చెందాలంటే ప్రభుత్వం కూడా ప్రత్యేక చొరవ తీసుకోవాలని అసోసియేషన్‌ సభ్యులు అధికారులను కోరారు. అనంతరం మైన్స్‌ సెక్రటరీ మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారన్నారు. సమస్యలను ప్రభుత్వం దష్టికి తీసుకెళ్ళడంతో పాటు ప్రభుత్వం ఏమీ చేస్తే సుద్ద నాపరాతి పరిశ్రమలు అభివద్ధి చెందుతాయనే అంశం పై అధ్యయనం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో క్వారీ, స్టోన్‌ మర్చంట్‌ వేల్పర్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు అబ్దుల్‌ రవూఫ్‌ నయీంఅప్పు, జుబెర్‌ లాల, నర్సింహులు, ఫయాజ్‌, కన్వర్‌, సంజీవ్‌, జయినుద్దీన్‌ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.