– వికారాబాద్ జిల్లా ఎస్పీ కే.నారాయణ రెడ్డి
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
పోలీస్ సిబ్బంది ఎలాంటి ఒత్తిడి లేకుండా పనిచేయాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ కె. నారాయణరెడ్డి తెలిపారు. మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీస్ అధికారులతో పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో వృత్తి పరమైన ఇబ్బందులు, కావాల్సిన మౌలిక సదుపాయల గురించి మొదలగు విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది, అధికారులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా, ప్రశాంతమైన వాతావరణంలో క్రమశిక్షణతో, ఓపికతో విధులు నిర్వర్తించాలని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా విధులు నిర్వర్తించాలని, అత్యవసరమైనా సమయంలో ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉండాలని, ప్రతి ఒక్కరూ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కు జిల్లా పోలీస్ డిపార్ట్మెంట్కు మంచి పేరు వచ్చే విధంగా పనిచేయాలని, సమయపాలన, క్రమశిక్షణను ప్రతి ఒక్కరూ పాటించాలని, ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ఎలాంటి చెడు అలవాట్లకు లోనుకాకుండా ఆరోగ్యంగా ఉండాలని, పోలీస్ అధికారులు, సిబ్బంది తెలియజేసిన శాఖపరమైన పనులపైన ప్రత్యేక దష్టి పెట్టాలని తెలిపారు. అనంతరం ఎస్పీ ఏఆర్ హెడ్ క్వాటర్స్‌లో ఉన్న బెల్ అఫ్ అర్మ్స్, స్టోర్ రూమ్, ఏఆర్డి ఎస్పి ఆఫీస్, ఆర్ఐ ఆఫీస్, డ్యూటీ ఆఫీసర్ రూమ్‌లను పరిశీలించారు. కార్యక్రమంలో డీటీసీ అదనపు ఎస్పీ పివి మురళీధర్, ఆర్ఐలు అంజాత్ పాషా, డేవిడ్ విజరు కుమార్, ఆర్ఎస్ఐలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.