– మాజీ సర్పంచ్‌ను అభినంచిన గ్రామస్తులు
నవతెలంగాణ-చేవెళ్ల
ప్రజలకు ఇబ్బందిగా మారిన లింకురోడ్డును సొంత నిధులతో బాగు చేయించాడు మాజీ సర్పంచ్ రామచం ద్రయ్యగౌడ్. చేవెళ్ల మండల పరిధిలోని రావులపల్లి గ్రా మం నుంచి ఎలుకగూడెం వరకు వెళ్లే రహదారి ముసల మ్మ వాగు వద్ద వాగులో గుమ్ములు వేయించారు. అదేవి ధంగా కాంక్రీట్‌తో ఇరు వైపుల దిమ్మలు కట్టించారు. రా వులపల్లి నుంచి ఎలుకగూడెం, పెద్ద మంగళారం, మొ యినాబాద్ వెళ్లే గ్రామ ప్రజలకు రైతులకు ఇతర గ్రా మాల నుంచి వచ్చే వారికి రాకపోకడలకు ఇబ్బందిగా ఉండేది గ్రామ రైతుల విన్నపం మేరకు వాగులో గు మ్ములు వేయించారు. ఈ గుమ్ములను రావులపల్లి మాజీ సర్పంచ్ రామచంద్రయ్యగౌడ్ తమ సొంత డబ్బుతో ఎలుకగూడెం వాగు వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లను తొలగించారు. అలాగే ముడిమ్యాల గ్రామం నుం డి రావులపల్లి (కుర్దు) గ్రామం వరకు ఉన్న మెయిన్ రోడ్ పాడవడం వలన గ్రామానికి వచ్చే ఆర్డీసీ బస్సు రాలేకపోయింది. రోడ్డును మరమ్మతులు వేయించడం వలన ఆర్టీసీ బస్సు, ఇతర స్కూల్ బస్సులు వాహనాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా రోడ్డుకు మరమ్మతులు చే యించారు. ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులు, రైతులు గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రావులపల్లి పీఏసీఎస్ డైరె క్టర్ కేసారం నరేందర్, మాజీ ఉప సర్పంచ్ పి.నాగిరెడ్డి, వార్డు మెంబర్స్ కావాలి సత్యనారాయణ, బుడ్డనలో కుమార్, పి.హనుమంత్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, రైతులు మాజీ సర్పంచ్ రామచంద్రయ్య గౌడ్ పాల్గొన్నారు.