స్పెషల్‌ డ్రైవ్‌తో.. పరిష్కారం ఏది..!

జిల్లాలో మొత్తం సుమారు 40 వేల దరఖా స్తులు పెండింగ్‌లో ఉన్నట్టు అధికారుల లెక్కలు చె బుతున్నాయి. ఇందులో ఇటీవల సుమారు– ధరణిలో పేరుకుపోతున్న
– పెండింగ్‌ ఫైల్స్‌ ఆందోళనలో భూ బాధితులు
– జిల్లాలో 35 వేల ధరణి పెండింగ్‌ దరఖాస్తులు
– సకాలంలోపరిష్కారించాలంటున్న రైతులు
రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణిని ప్రక్షాళన చేస్తాం.. రైతుల భూ సమస్యలు పరిష్కారిస్తామని చెప్పింది. కానీ అధికారంలోకి వచ్చిన ఆరునెలలు గడుస్తున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. రైతులకు తిప్పలు తప్పడం లేవు. స్పెషల్‌ డ్రైవ్‌ల పేరుతో హడాహుడి చేయడం తప్పా సమస్యలు పరిష్కరించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు సైతం రైతులు గోడు పట్టించుకోవడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే సమస్యలు పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. ధరణి సమస్యలపై కథనం
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
కాలయాపనలో స్పెషల్‌ డ్రైవ్‌లు..
జిల్లాలో మొత్తం సుమారు 40 వేల దరఖా స్తులు పెండింగ్‌లో ఉన్నట్టు అధికారుల లెక్కలు చె బుతున్నాయి. ఇందులో ఇటీవల సుమారు ఐదు వేల దరఖాస్తులను మాత్రమే పరిష్కరించినట్టు తెలుస్తోంది. 35 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నా యి. ఈ దరఖాస్తులు తహసీల్దార్లు, ఆర్డీవోలు, అదనపు కలెక్టర్‌ వద్ద ఉన్నాయి. వరుస ఎన్నికల కోడ్‌కు తోడు రెవెన్యూ అధికారుల బదిలీ, కొత్తగా వచ్చిన అధికారులు వీటి పరిష్కారానికి అంతగా ఆసక్తి చూపక పోవడంతో దరఖాస్తులు గుట్టలుగా పేరుక పోవడానికి ప్రధాన కారణం. ధరణి పోర్టల్‌ లో దరఖాస్తు చేసి నెలలు గడుస్తున్నా.. సమస్య పరిష్కారం కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అప్పుల చెల్లింపులకు, ఇతర అవ సరాలకు ఆర్థిక వనరులు సమకూర్చుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
ధరణి పోర్టల్‌లోని 33 రకాల మాడ్యుల్స్‌ ద్వారా వచ్చే దరఖాస్తులన్నీ నేరుగా కలెక్టర్‌ లాగిన్‌లోనే ఉండిపోయేవి. ఆయన వాటిని ఆమోదించడమో లేదా తిరస్కరించడమో చేసేవా రు. ఆమోదించిన వాటికి క్షేత్ర స్థాయి నివేదికల కోసం తహసీ ల్దార్లకు పంపేవారు. వారు ఆయా దరఖాస్తులకు సంబంధించిన పూర్వ రికార్డులన్ని క్షుణ్నంగా పరి శీలించి, క్షేత్ర స్థాయిలో విచారించి, తుది నివే దికను కలెక్టర్‌కు సమర్పించే వారు. ఆయన వాటికి ఆమోదం తెలిపేవారు. ఈ ప్రక్రియలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటుండ టంతో తాజాగా ప్ర భుత్వం ఫోర్టల్‌లో పలు మార్కులు తీసుకొచ్చింది. ఇక మీదట దరఖాస్తు నేరుగా తహసీల్దార్‌ లాగిన్‌కు అటు నుంచి ఆర్డీఓకు, అటు నుంచి అదనపు కలెక్టర్‌కు, జిల్లా కలెక్టర్‌ లాగిన్‌లోకి చేరుతుంది. చిన్న చిన్న సమ స్యలకు తహసీల్దార్‌ స్థాయిలోనే పరిష్కారం లభిం చనున్నాయి. అయినప్పటికీ ఎక్కడ ఫైల్స్‌ అక్కడే కుప్పతెప్పలుగా పెరుకుపోతున్నాయి. ఉన్నతాధి కారులు రైతుల గోడును పట్టించుకుని.. పెం డింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించాలని భూ బాధితులు కోరుతున్నారు.