కవ్వాల్‌ టైగర్‌ జోన్‌లోని డాగ్‌స్క్వాడ్‌ మృతి

కవ్వాల్‌ టైగర్‌ జోన్‌లోని డాగ్‌స్క్వాడ్‌ మృతి– సాంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు
నవతెలంగాణ-జన్నారం
కవ్వాల్‌ టైగర్‌ జోన్‌ అటవీ కలప అక్రమ రవాణా దారుల గుండెల్లో గుబులు పుట్టించిన, డాగ్‌ స్క్వాడ్‌(చీతా) మృతి చెందింది. అటవీశాఖ అధికారులు మంగళవారం కుక్కకు అంత్యక్రియలు నిర్వహించారు. జర్మనీ షెఫర్డ్‌ చెందిన ప్రత్యేక శిక్షణ పొందిన కుక్క పేరు చీతా ఆ పేరు వింటేనే స్మగ్లర్ల గుండెల్లో గుబులు పుట్టించేంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని కవ్వాల పులుల అభయారణ్యంలోని జన్నారం డివిజన్‌కు 2018 డిసెంబర్‌ 15న మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ లో ప్రత్యేక శిక్షణ పొందిన స్థానిక అటవీ బీట్‌ అధికారులు శ్రీగాద శ్రీనివాస్‌, జాడి సత్యనారాయణ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జర్మనీ షెఫర్డ్‌ చీతా(కుక్క)ను ఇక్కడికి తీసుకొచ్చారు. ఆ చీతా గుండెపోటు గురై సోమవారం మృతి చెందింది. ఆ తర్వాత వెటర్నరీ డాక్టర్‌ చే పోస్టుమార్టం నిర్వహించి స్థానిక అటవీ శాఖ సముదాయ ప్రాంతంలో సంప్రదాయ పద్ధతిలో తాళ్ళపేట, జన్నారం ఇన్‌చార్జి రేంజ్‌ ఆఫీసర్‌ సుష్మారావు, ఇందన్‌పెల్లి రేంజ్‌ ఆఫీసర్‌ ఎండీ హఫీజోద్దీన్‌, డిప్యూటీ రేంజ్‌, ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్లు తిరుపతి, హైమావతి, మమత శ్రీనివాస్‌, రైమోద్దీన్‌, డివిజన్‌ సూపరిండెంట్‌ షమీమోదీన్‌, అసిస్టెంట్‌ రవీందర్‌లు సంప్రదాయ పద్ధతిలో ఖననం చేశారు.