రెంజల్ మండలం దూపల్లి గ్రామపంచాయతీ ఆవరణలో మండల ప్రత్యేక అధికారి వాజిద్ హుస్సేన్, ఎంపీడీవో హెచ్ .శ్రీనివాస్, ఎంఈఓ గణేష్ రావు, ఎంపీ ఓ గౌస్ ఉద్దీన్, లు ప్రతి కుటుంబానికి మొక్కలు పంపిణీ కి శ్రీకారం చుట్టారు. హరితహారం లో భాగంగా ప్రతి ఇంటి పెరట్లో మొక్కలు నాటాలని వారు సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ఇంటి ముందు మొక్కలు పెంచాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి సిహెచ్ సాయి, అంగన్వాడి టీచర్లు, ఆశ వర్కర్, గ్రామ మహిళలు పాల్గొన్నారు.