– ముఖ్య అతిథులుగా జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల క్యాంపస్ లో రామచంద్రాజి మంగీలాల్ స్మారక వాటర్ ప్లాంట్ నిర్మించడం జరిగింది. దీని ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు హాజరుకానున్నారు వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవంతో పాటు ఉత్తమ విద్యార్థులకు పురస్కారాలు కార్యక్రమము తేదీ 11-07-2024 రోజు గురువారం మధ్యాహ్నం జరగనుంది. ప్రారంభోత్సవం. అనంతరం ప్రత్యేక సమావేశం స్థానిక గురు ఫంక్షన్ హాల్ యందు నిర్వహించబడే సభకు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు. కార్యకర్తలు ,అభిమానులు మిత్రులు..ప్రజలు పాత్రికేయ సోదరులు..పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని గోవింద్ ప్రసాద్ జి. పప్పు సెట్, జహార్, కపిల్ సెట్ జహార్, ఒక ప్రకటన ద్వారా కోరారు.