ప్రజల పక్షాన నిలబడి కొట్లాడుదాం: చల్మెడ

– తల్లి లాంటి పార్టీని కాపాడుకుందాం..
– ఉత్తర తెలంగాణలోనే కాంగ్రెస్  తక్కువ ఓట్లు వేములవాడలోనే..
– పదవీకాలం ముగిసిన ప్రజాప్రతినిధులకు ఆత్మీయ సన్మానం..
– వేములవాడ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు..
నవతెలంగాణ – వేములవాడ 
ప్రభుత్వం ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేస్తే ప్రజల పక్షాన నిలబడి కొట్లాడుదామని వేములవాడ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు అన్నారు. వేములవాడ నియోజకవర్గంలో పదవీకాలం ముగిసిన ఎంపీపీ, జెడ్ పి టి సి, ఎంపీటీసీలను చల్మెడ నివాసంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఘనంగా సత్కరించి సన్మానించారు. ఈ సందర్భంగా లక్ష్మీనరసింహారావు మాట్లాడుతూ ప్రజా జీవితంలో నిస్వార్ధంగా పనిచేసే వారికి ఎప్పటికైనా గుర్తింపు ఉంటుందని అన్నారు. తాజా మాజీలుగా ఉన్న మీరు ప్రజా సమస్యల్లో పాలుపంచుకొని వారికి అండగా నిలిచి ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించారు. ప్రతిపక్షంలో ఉన్నందునే ప్రజల పక్షాన గొంతుకై ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు దిశగా ప్రభుత్వ పనితీరును ఎండగట్టాలని వివరించారు.  మానసిక వికలాంగత్వాన్ని వీడి పోరాటం చేసే ప్రతిభను అలవాటు చేసుకోవాలని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రాకపోతే బిజెపితో కుమ్ముక్కి అయినట్టేనని చేసిన సవాలు నిజమైందని అన్నారు. ఉత్తర తెలంగాణలోనే వేములవాడ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీకి తక్కువ ఓట్లు రావడమే ఇందుకు నిదర్శనం అన్నారు.
ప్రజల్లో పార్టీ బలంగా ఉందని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోను సత్తా చాటుదామని వారికి సూచించారు. గడచిన పార్లమెంట్ ఎన్నికల్లో మనకు అత్యధికంగా ఓట్లు రావడం మీరు చేసిన కృషి వల్లనేనని గుర్తు చేసి కృతజ్ఞతలు తెలిపారు. రైతులకు రుణమాఫీ ఆగస్టు 15 లోపు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లుగానే మద్యమాన్ని నిర్వాసితులకు కూడా ఎన్నికల సమయంలో ఇచ్చిన ఐదు లక్షల 40 వేల రూపాయల నగదు అందజేతపై కూడా కటాఫ్ డేట్ చెప్పాలని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు సవాల్ విసిరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పార్టీ అధ్యక్షుడు తోట  అగయ్య మాట్లాడుతూ రాజకీయాల్లో రిటైర్మెంట్ ఉండదని సందర్భంగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు సేవ చేయాలని గుర్తు చేశారు. జిల్లా పార్టీ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటుందని ఏ సమయంలోనైనా తాను స్పందించి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చేందుకు ప్రతి ఒక్కరం సైనికుల పని చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ మాట్లాడుతూ మనసుపెట్టి పార్టీ కోసం పనిచేయాలని ఆమె సూచించారు. పనిచేసే వారికి తప్పనిసరిగా పదవులు వస్తాయని 2014లో సర్పంచ్ గా పని చేసిన తనకు రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పాటు తర్వాత మొదటి జిల్లా పరిషత్ చైర్మన్ గా  అవకాశం రావడమే ఇందుకు నిదర్శనం అని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడ్డగోలుగా హామీలు ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చిందని కళ్యాణ లక్ష్మితో తులం బంగారం, 2500 రూపాయల భృతి లాంటివి కూడా అందించడంలో విఫలమై ప్రభుత్వం మీద వ్యతిరేకత మొదలైందని చెప్పారు. అనంతరం మాజీ ఎంపీపీలు, జెడ్పిటిసిలు, ఎంపీటీసీలు, కో ఆప్షన్ సభ్యులను పార్టీ ఇంచార్జ్ చెల్మెడ లక్ష్మీనరసింహారావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు తోట ఆగయ్య లతో కలిసి ఘనంగా సన్మానించి మెమొంట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా పార్టీ అధ్యక్షుడు తోట ఆగయ్య, మాజీ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ, పార్టీ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, రాఘవరెడ్డి, రవికుమార్,  మాజీ ఎంపీపీలు ఉమా రత్నాకర్ రావు, స్వరూప మహేశ్, చంద్రయ్య గౌడ్, బైరగోని లావణ్య, మాజీ జెడ్పిటిసిలు మ్యాకల రవి, ఏశ వాణి, నాగం భూమయ్య, సెస్ డైరెక్టర్ రేగులపాటి హరి చరణ్ రావు, మాజీ వైస్ ఎంపీపీ ఆర్ సి రావు, కిరణ్ రావు, మందాల అబ్రహం, మండల పార్టీ అధ్యక్షులు గోస్కుల రవి, సత్తి రెడ్డి, మల్యాల దేవయ్య, సింగిల్ విండో చైర్మన్ బండ నరసయ్య యాదవ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లు ప్రభాకర్ రావు, ఏనుగుల శ్రీనివాస్, మాజీ ఎంపిటిసిలు, నాయకులు చిలుక పెంటయ్య తదితరులు ఉన్నారు.