– రూ.3 లక్షల 83 వేల 477 రూపాయల ఆదాయం..
నవతెలంగాణ – వేములవాడ రూరల్
అగ్రహారం శ్రీ హనుమాన్ దేవాలయంలో బుధవారం హుండీ లెక్కింపు చేశారు. ఇట్టి హుండీ లెక్కింపులో రూ. 3,83,477 రూపాయలు ఆదాయం సమకూరినట్టు ఆలయ అధికారులు తెలిపారు. ఈ లెక్కింపు పర్యవేక్షణ లో పి.సత్యనారాయణ పరిశీలకులు దేవాదాయ శాఖ కరీంనగర్, ఆలయ వ్యవస్థాపక వంశీయ ధర్మకర్త గౌరీశెట్టి మహేందర్, ఆలయ కార్యనిర్వాహణాధికారి ఎండపల్లి మారుతి, ఆలయ సిబ్బంది, సత్య సాయి సేవాసమితి సిరిసిల్ల శాఖ తో పాటు తదితరులు పాల్గొన్నారు.