రక్షిత్ అట్లూరి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘ఆపరేషన్ రావణ్’. ఈ చిత్రాన్ని ధ్యాన్ అట్లూరి నిర్మాణంలో న్యూ ఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా దర్శకుడు వెంకట సత్య రూపొందిస్తున్నారు. సంగీర్తన విపిన్ హీరోయిన్గా నటిస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 2న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ వస్తోంది. ఈ సందర్భంగా బుధవారం ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ వేడుకను మేకర్స్ ఘనంగా నిర్వహించారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీపాల్ చొల్లేటి మాట్లాడుతూ, ‘ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేయడం హ్యాపీగా ఉంది. సినిమా బాగా వచ్చింది’ అని తెలిపారు. ‘ట్రైలర్ మీకు నచ్చిందని ఆశిస్తున్నా. ఇందులో నేను టీవీ రిపోర్టర్ పాత్రలో కనిపిస్తా. మీ అందర్ని మెప్పించే సినిమా ఇది’ అని హీరోయిన్ సంగీర్త విపిన్ చెప్పారు. డైరెక్టర్ వెంకట సత్య మాట్లాడుతూ, ‘మన ఆలోచనల ప్రభావం వల్లే మనం మంచి వాళ్లా లేక చెడ్డ వాళ్లా అనేది నిర్ణయించడం జరుగుతుంది. ఆ పాయింట్‌తో ఈ సినిమాను రూపొందించాను. ఫస్ట్ టైమ్ ఆలోచనలను విజువల్‌గా తెరపై చూపించబోతున్నా. మా అబ్బాయిని డైరెక్ట్ చేస్తున్నా అనే విషయం నన్ను పెద్దగా ప్రభావితం చేయలేదు. రక్షిత్ బాగా నటించాడు’ అని తెలిపారు. ”పలాస’ తర్వాత మా ప్రొడక్షన్లోనే సైకో థ్రిల్లర్ మూవీ చేద్దామని స్టోరీ లైన్ అనుకున్నాం. అప్పుడు నాన్న ఈ సినిమాకు డైరెక్షన్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ సినిమాతో మేం సక్సెస్ అందు కోబోతున్నాం. అని హీరో రక్షిత్ అట్లూరి చెప్పారు.
ఈ సినిమా ట్రైలర్ ప్రామిసింగ్‌గా ఉంది. హీరో రక్షిత్ వాళ్ళ నాన్న వెంకట సత్య చాలా ప్యాషన్‌తో ఈ సినిమాకి డైరెక్ట్ చేశారని తెలుస్తోంది. ‘పలాస’ సినిమాతో రక్షిత్‌కి మంచి పేరొచ్చింది. ఈ సినిమాతో మరోసారి రిస్క్ చేస్తున్నారు. రిస్క్ చేసినప్పుడే సక్సెస్ మన దగ్గరికి వస్తుందనేది నా నమ్మకం. ఆ నమ్మకం ఈ సినిమా విషయంలో నిజం కావాలని ఆశిస్తున్నా.
– హీరో విశ్వక్సేన్