స్ట్రాంగ్ కంటెంట్‌తో రాబోతున్న చిత్రం ‘ద బర్త్‌డే బారు’. రవికష్ణ, సమీర్ మళ్లా, రాజీవ్‌కనకాల ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో పలువురు నూతన నటీనటులు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని బొమ్మ బొరుసా పతాకంపై ఐ.భరత్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి విస్కి దర్శకుడు. ఈనెల 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర ట్రైలర్ విడుదల వేడుక బుధవారం వినూత్నంగా ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ,’యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్ర కథ రాసుకున్నాను. నా జీవితంలో తొమ్మిది సంవత్సరాల క్రితం జరిగిన ఓ సంఘటనకు కథ రూపం ఇది’ అని తెలిపారు. ‘ఇదొక కామెడీ డ్రామా. చిత్రంలోని ప్రతి పాత్ర ఎంటర్‌టైన్ చేస్తుంది. ప్రతి సన్నివేశం కొత్తగా ఉంటుంది. ఎం.ఎస్ చదవడానికి విదేశాలకు వెళ్లినప్పుడు ఐదుగురు చిన్ననాటి స్నేహితులకు జరిగిన సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఐదుగురు స్నేహితులకు ఎదురైన అనుభవాలు, వాటి పర్యవసానాలు చాలా ఆసక్తికరంగా వుంటాయి.ఈ సినిమా సహజత్వం కోసం సింక్ సౌండ్ వాడాం. కంటెంట్‌తో పాటు మంచి టెక్నికల్ వాల్యూస్‌తో ఈ చిత్రం ఉండబోతుంది’ అని నిర్మాత ఐ.భరత్ చెప్పారు.