జడ్పీహెచ్ఎస్ విద్యార్థులకు అందని ద్రాక్షగా వసతులు..

Unable facilities for ZPHS students..– పట్టించుకోని విద్యార్థుల సమస్యలు

– ఏడు వందల పై చిలుకు విద్యార్థులకు భోదన
– పదిమంది ఉపాద్యాయుల కోరత
– విద్యార్థులకు గదుల కొరత
నవతెలంగాణ – జుక్కల్
మండల కేంద్రం లోని జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థుల సమస్యల పథాకా స్థాయికి చేరింది. జిల్లా లోనే అత్యదికంగా ప్రభూత్వ పాఠశాలలో సుమారుగా ఏడు వందలకు పై విద్యార్థిని , విద్యార్థులు విద్యనబ్యసిస్తున్నారు. ప్రస్తుతం ఒక హెచ్ఎం, ఒక పీఈటీ తో పాటు ఎనమిది మంది ఉపాద్యాయులతో కలిసి పదిమంది ఉన్నారు. వాస్తవానికి ఇరువై రెండు మంది ఉండాల్సింది పోయి పది మంది తోనే సరి పెట్టుకుంటున్నారు. ఇటివలే రాష్ట్రం ప్రభూత్వం జనరల్ ట్రాన్స్ ఫర్ లతో  పాటు , భార్యభక్తలకు ఒకే చోట ఉండడానికి వీలుకల్పించి, ఉద్యోగంలో పదోన్నతులు కల్పించారు. వారంతా రీలీవ్ అయిపోయారు. వచ్చెవారు రాకపోవడంతో ఉపాద్యాయుల కోరత ఎర్పడి విద్యార్థుల చదువు పైన ఎఫెక్ట్ పడటంతో విద్యార్థుల తల్లి దండ్రులు అందేళన చెందుతున్నారు. – విద్యార్థులు చేరెందుకు క్యూకడుతున్నారు:- పాఠశాలలో ముందే సమస్యలుండగా ఇంకా గ్రామాల నుండి వుద్యార్థుల పేరేంట్స్ చేర్చుకోవాలని ఓత్తిడి చేస్తున్నారు. రాజకీయ నాయకుల రికమండేషన్ చేయిస్తు హెచ్ఎం పైన ఓత్తీడి చేయడంతో తల పట్టుకుంటున్నారు ఉపాద్యాయులు.
గదుల కోరత : సుమారుగా ఏడు వందల పైచిలుకు విద్యార్థులకు పాఠశాలలో ఉన్న గదులు సరిపోక పోవడంతో కింద కూర్చో పెడితే పేరెంట్స్ వచ్చి గోడవలు చేస్తున్నారు. సమాదానం చెప్పలేక ఉరికేనే ఉంటున్నారు. విద్యావ్వస్థలో మారుమూల జుక్కల్ ప్రాంత విద్యార్థులు చదువు కుంటాం అడ్మీషన్ చేసుకొండని హెచ్ఎం కు ప్రాదేయపడీల్సిన దుస్తితి నెలకొంది. రాష్ట్ర, జిల్లా కలెక్టర్, విద్యాశాఖ అధికారీ సమస్యల పట్ల దృష్టి సారించి వసతులు కల్పించాలని మండలంలోని విద్యార్థి సంఘాలు, పేరెంట్స్ కోరుతున్నారు.