వన మహోత్సవంలో భాగంగా గ్రామంలో నాటిన ప్రతి మొక్కను కాపాడాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని, మొక్కలను సంరక్షించేందుకు తగిన చర్యలు చేపట్టాలని ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ అన్నారు. గురువారం మండలంలోని కోనాపూర్ గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొని మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటితే సరిపోదని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం ఒక్కటే పరిష్కారం అన్నారు. ప్రస్తుతం మనం నాటిన మొక్కలే వృక్షాలై మన భవిష్యత్తు తరాలకు ప్రాణ వాయువును అందిస్తాయన్నారు. నాటిన మొక్కలను కాపాడేందుకు ప్రజలు బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించేందుకు మొక్కలకు కంచెలను ఏర్పాటు చేయాలన్నారు.కార్యక్రమంలో ఈజిఎస్ ఏపీవో విద్యానంద్, పంచాయతీ కార్యదర్శి రజిత, ఫీల్డ్ అసిస్టెంట్, గ్రామ మహిళా సంఘాల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.