– ఇతర మార్గాల ద్వారా ప్రయాణికులు ప్రయాణాలు కొనసాగించాలి
– నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సూచన
నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శ్రీ జగన్నాథ రథయాత్ర ర్యాలీ ఉన్నందున ప్రయాణికులు ఇతర మార్గాల ద్వారా ప్రయాణాలను కొనసాగించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సూచించారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు. నగర ప్రజలు తేదీ 12-07-2024 న మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 7 వరకు ఇస్కాన్ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంస్థ (ISKCON) తరఫున శ్రీ జగన్నాథ రథయాత్ర జరుపుతున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఈ రథయాత్ర కంటేశ్వర్ టెంపుల్ మొదలుకొని ఎన్టీఆర్ చౌరస్తా, రైల్వే స్టేషన్, తిలక్ గార్డెన్, గవర్నమెంట్ హాస్పిటల్, సాయి రెడ్డి పెట్రోల్ పంప్ (మమత సర్కిల్ ) గాంధీ చౌక్, నెహ్రూ పార్క్, పెద్ద బజార్, ఆర్ ఆర్ చౌరస్తా, పూలoగ్ చౌరస్తా చివరిగా విజయ లక్ష్మి గార్డెన్ (వినాయక నగర్) చేరుకొని ర్యాలీ ముగుస్తుందని తెలియజేశారు. కావున నగర ప్రజలు ఇట్టి విషయాన్ని గమనించి పై సూచించిన మార్గాలు తప్ప వేరే ఏ ఇతర మార్గాల ద్వారా తమ యొక్క ప్రయాణాలు కొనసాగించాలని ట్రాఫిక్ పోలీస్ నిజామాబాద్ తరపున విజ్ఞప్తి చేస్తున్నామని తెలియజేశారు.