నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్.
జిల్లా కేంద్రంలో కేసారం, కుసుమ వారి గూడెం దగ్గర గత ప్రభుత్వం కట్టిన రెండు పడకల గదుల ఇండ్లను లబ్ధిదారులకు త్వరగా అందించాలని సీపీఐ పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ తేజస్ నందు లాల్ పవర్ గారికి పలు డిమాండ్లతో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం కట్టించిన రెండు పడకల గదుల ఇండ్లు మూడేళ్లు అవుతున్న ఇంతవరకు లబ్ధిదారులకు అందించకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనం అని అన్నారు. అక్కడ 350 పైగా రెండు పడకల ఇండ్లు ఉంటే గత ప్రభుత్వం 850 మంది దాకా డ్రాలో ఎంపిక చేసి పట్టాలు అందజేశారు. అక్కడ అన్న ఇండ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. కానీ ఇంకా 500 మందికి అక్కడ రెండు పడకల గదులు ఇల్లు లేవు మరి ఆ లబ్ధిదారులకు ఎక్కడ ఇస్తారో తెలియజేయాలని ఆయన అధికారులను కోరారు. ఇప్పటికైనా కలెక్టర్ జోక్యం చేసుకొని 850 మంది లబ్ధిదారులకు త్వరగా రెండు పడకల ఇండ్లను అందజేయాలని ముఖ్యంగా దివ్యాంగులు ఉండటానికి ఇండ్లు లేక కిరాయిలు కట్టలేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు వారికి ముందు అందజేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ కార్యవర్గ సభ్యులు నిమ్మల ప్రభాకర్, పెండ్ర కృష్ణ నవీన్ పాషా తదితరులు పాల్గొన్నవారు.