అప్రకటిత విద్యుత్ కోతలు

Unannounced power cuts– రోజులో 4-5 గంటలు కరెంట్ సరఫరా నిలిపివేత
– అవస్థలు పడుతున్న ప్రజలు
– ముందస్తు సమాచారం లెంకుండా కోతలు విధిస్తున్నారని మండిపాటు
నవతెలంగాణ – మల్హర్ రావు
అప్రకటిత విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. కరెంట్ సరఫరా ఎక్కడ ఎప్పుడు నిలిచిపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. మండలంలో విద్యుత్ మరమ్మతుల నిర్వహణ పనుల పేరుతో గంటల కొద్దీ కరెంట్ సరఫరా నిలిపివేస్తున్నారు. రోజులో సుమారు 4 నుంచి 5 గంటపాటు విద్యుత్ కోతలు విధిస్తున్నారు. మండల కేంద్రమైన తాడిచెర్లలో విపరీతమైన కరెంట్ కోతలతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. ముందస్తుగా సమాచారం లేకుండా రాత్రి,పగలు అనే తేడా లేకుండా అప్రకటిత కరెంట్ సరఫరా నిలిపివేయడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పల్లెల్లో కరంట్ ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితితో ఆందోళన చెందుతున్నారు. ఎండకాలం మాదిగానే వానాకాలంలో కూడా విద్యుత్ కోతలు యధావిధిగా ఉన్నాయంటున్నారు. ఈదురు గాలులు, మెరుపులు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసినప్పుడు విద్యుత్ సరపరా నిలిపివేయడం సహజమని, చిన్నపాటి చినుకులు, గాలి విస్తే కరెంట్ తీయడమేమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. విద్యుత్ లైన్, సబ్ స్టేషన్ల మరమ్మతు నిర్వహణ పేరుతో ఇష్టానుసారంగా విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నారని వాపోతున్నారు.
ఇష్టం వచ్చినట్లుగా కోతలు విధిస్తున్నారు: కోడీమ్యాల భాస్కర్…తాడిచెర్ల
మరమ్మతుల కోసం అంతరాయం…విద్యుత్ ఏఈ..సంపత్ యాదవ్
విద్యుత్ లైన్లు, సబ్ స్టేషన్ల మరమ్మతు నిర్వహణ పనులు చేసేటప్పుడు తప్పా మిగతా సమయాల్లో విద్యుత్ అంతరాయం లేదు. వర్షాలు పడుతున్న కారణంగా అప్పుడప్పుడు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుంది. విద్యుత్ తిగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలు తొలగిస్తున్న సమయంలో కూడా విద్యుత్ అంతరాయం తప్ప ఎప్పుడు కోతలు ఉండవు. ముందస్తుగా సమాచారం ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టుగా కరెంట్ సరఫరా నిలిపివేస్తున్నారు.కరెంట్ ఎప్పుడు పోతుందో..ఎప్పుడు వస్తుందో అర్థం కావడం లేదు.అప్రకటిత విద్యుత్ కోతలతో ఇబ్బందులు తప్పడం లేదు.