– రూ.2వేలు జరిమానా…
– సిరిసిల్ల జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్. ప్రేమలత తీర్పు వెల్లడి…
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
హత్య కేసులో నిందుతునికి జీవిత ఖైదు, రూ.2వేలు జరిమాన విధిస్తూ సిరిసిల్ల జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్. ప్రేమలత శుక్రవారం తీర్పు వెల్లడించారని జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.తంగళ్ళపల్లి మండలం రాళ్లపేట గ్రామానికి చెందిన ఇలవేణి స్వప్నకి, తన మరిది నవీన్ ల మధ్య తరచు గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంల సెప్టెంబర్ 7 2020 న స్వప్న, నవీన్ ల మధ్య గొడవ జరుగుతుండగా సప్న తండ్రి గీస రాములు గొడవను ఆపే ప్రయత్నం చేశారు. కోపోద్రిక్తుడైన నవీన్ రాములు తలపైన పారతో కొట్టాగా తీవ్రంగా గాయపడిన రాముల్ని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. రాములు చికిత్స పొందుతూ మరసటి రోజు మృతి చెందాడు.ఈ ఘటనపై తంగళ్ళపల్లి పోలీసులు కేసు నమోదు చేసి నవీన్ ని రిమాండ్ కు తరలించారు.అప్పటి సీ.ఐ సర్వర్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ నర్సింగరావు వాదించాగా కోర్టు మానిటరింగ్ ఎస్.ఐ రవీందర్ నాయుడు ఆధ్వర్యంలో కానిస్టేబుల్లు నరేందర్, నవీన్ లు కోర్టులో 13 మంది సాక్షులను ప్రవేశపెట్టారు.పూర్వాపరాలను పరిశీలించిన న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో నిందితుడికి జీవిత ఖైదు తో రూ.2వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.