కళాశాలను ఆకస్మిక తనిఖీ చేసిన విద్యాధికారి

Education officer who conducted a surprise inspection of the collegeనవతెలంగాణ – మాక్లూర్ 
మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను నిజామాబాద్ జిల్లా ఇంటర్ విద్య అధికారి రవి కుమార్ శుక్రవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా  కళాశాలలలో  2023-24 విద్య  సంవత్సరం పరీక్షల ఫలితాలపై సమీక్షించారు. అలాగే 2024-25 విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్ల ప్రక్రియ పై సమీక్ష నిర్వహించారు. మొదటి సంవత్సరంలో అడ్మిషన్ల సంఖ్య ఆశించిన మేరకు లేనందున విద్యార్థుల చేరిక కోసం ఇంకా అధ్యాపకులు, సిబ్బంది ప్రతి గ్రామంలో పదవ తరగతి పాసైన విద్యార్థులను చేర్పించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. అలాగే అధ్యాపకుల పనితీరు, గత విద్యా సంవత్సరంలో విద్యార్థులకు వచ్చిన మార్కులు, పాస్ పర్సెంటేజీలపై ప్రతి అధ్యాపకుని అడిగి తెలుసుకున్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో మరిన్ని మంచి ఫలితాలను సాధించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆదేశించారు. అలాగే ప్రభుత్వ కళాశాలలో ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత పాఠ్యపుస్తకాలు, లైబ్రరీలు, ప్రయోగశాలల నిర్వహణ, మూత్రశాలలు, మరుగుదొడ్లు, మంచినీటి వసతి పై ప్రజలకు అవగాహన కలిగించి ఇంటర్ ఉచిత విద్యను పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అందించేందుకు కృషి చేయాలని అన్నారు. అలాగే కళాశాల కార్యాలయ సిబ్బంది పని తీరు పై సమీక్షించారు. ఈ సమావేశాలలో ప్రిన్సిపాల్ గంగారాం, కళాశాలల అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.