నవతెలంగాణ – రెంజల్
ఇటీవల రెంజల్ సొసైటీ పైన నమోదు కాబడిన కేసులో రూ.53,330 రూపాయల జరిమానా విధించినట్లు వ్యవసాయ శాఖ అధికారి లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు. ఇట్టి డబ్బులను రెంజల్ సింగిల్ విండో చెల్లించడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సొసైటీ సీఈఓ వై. రాము కు 1170 బస్తాలను తిరిగి అప్పగించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.