పట్టణంలోని క్ష.త్రియ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎంబీఏ డిపార్ట్మెంట్ శుక్రవారం సెలబ్రేషన్స్ చాలా అంగరంగవైభవంగా ఫేర్వెల్ డే “పార్టింగ్ హార్ట్స్” నిర్వహించారు. ఈ కార్యక్రమానికి క్షత్రియ విద్యాసంస్థల కార్యదర్శి శ్రీ అల్జాపూర్ దేవేందర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంబీఏ కోర్సు ముగించుకొని బయటికి వెళ్లే విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని క్షత్రియ విద్యాసంస్థలకు మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. ఈ రోజుల్లో ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థులు డ్రగ్స్, గాంజా మరియు ఇతర మత్తు పదార్ధాలకు బానిసై జీవితాలను వ్యర్థం చేసుకుంటున్నారని అన్నారు. త్రిపుర అనూహ్యంగ 828 మందికి HIV సోకగా వారిలో నుండి 43 మంది ఎయిడ్స్ వ్యాధితో మరణించారని, కారణం ఇంజెక్టల్ సిరంజ్ లను యధేచ్చగా ఒకరి నుండి మరొకరు డ్రగ్స్ ఎక్కించుకునేందుకు వాడటమే కారణం అన్నారు. నేడు శత్రు దేశాలు భారత యువతను మత్తుకు బానిస చేసి దేశ భవిష్యత్హును అంధకారంలోకి నెట్టేవేసే కుటిల యత్నాలు చేస్తున్నాయని అన్నారు. ఇలాంటి చెడు అలవాట్లకు బానిస కావద్దని విద్యార్థులకు ఉద్బోధించారు.విద్యార్థులు కళాశాల వదిలిన తర్వాత వారు నిరంతరం పూర్వ విద్యార్థులుగా ఉంటూ వివిధ సందర్భాల్లో కళాశాలను సందర్శిస్తూ జూనియర్ విద్యార్థులకు మార్గదర్శనం చేయాలని కోరారు.ప్రిన్సిపాల్ ఆర్కె పాండే మాట్లాడుతూ ప్రొఫెషనల్ విద్యలో సీనియర్ జూనియర్ రిలేషన్స్ కేవలం కళాశాలకె పరిమితం కాకుండా కళాశాల నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా కొనసాగుతూ జూనియర్ ల యొక్క అభివృద్ధికి తోడ్పడాలని అన్ని వేళల సీనియర్లు జూనియర్లకు మార్గదర్శనం చేయాలని ఆశించారు. కళాశాలకు మంచిపేరు తేవాలని అభిలషించారు.
హెచ్ ఓ డి డాక్టర్ సుధాకర్ మాట్లాడుతూ ప్రతి కళాశాలకు ఫేర్వెల్ పార్టీ ఒక భావోద్వేగాలతో కూడిన విషయమని విద్యార్థులను కళాశాలను విడిచి వెళ్ళడం కేవలం భౌతికంగా మాత్రమే జరుగుతుందని, వారు నిరంతరం అందరితో మానసికంగా కలిసే ఉండాలని అన్నారు. విద్యార్థులు రెగ్యులర్ గా కాలేజీ లకు హాజరై ప్రాక్టికల్ విషయల్లో మెళుకువలు నేర్చుకోవాలని అన్నారు. అంతేకాక ఉన్నత కాలేజీ లు , యూనివర్సిటీల్లో చదివిన విద్యార్థులు జీవితంలో ఎదిగిన తరువాత ఊరికి, చదివిన విద్యాసంస్థలకు, సమాజానికి కొంత మేరకు సహాయం చేసి వాటి అభివృద్ధికి తోడ్పడాలని అభిలషించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ రకాల నృత్యాలతో ,నాటకాలతో అలరించారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ మేనేజ్మెంట్ పరీక్షిత్, వీరేందర్ వివిధ విభాగాల అధిపతులు, ప్లేసెమెంట్ ఆఫీసర్, కోఆర్డినేటర్ ఎంబీఏ డిపార్ట్మెంట్ టీచర్స్ పాశం సుధాకర్, ప్రతిమ, ప్రవీణ, భరత్, ఎంబీఏ విద్యార్థులు పాల్గొన్నారు..