జిల్లా ఇంఛార్జి ఎస్సీ అభివృద్ధి అధికారి నియామకం

Appointment of District Incharge SC Development Officerనవతెలంగాణ – సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లా  ఇంఛార్జి ఎస్సి అభివృద్ధి అధికారిగా ఎం.విజయ లక్ష్మీని  నియమిస్తూ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ఉత్తర్వులు జారీ చేశారు. ఈడి ఎస్సీ కార్పొరేషన్ గా విధులు నిర్వహిస్తూ జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారిగా అదనపు బాధ్యతలు నిర్వహించిన డాక్టర్ వినోద్ కుమార్ సొంత శాఖకు తిరిగి  కేటాయించబడి జిల్లా నుండి రిలీవ్ అయ్యారని  తెలిపారు. జిల్లాలో ఎస్సీ శాఖ పరిపాలన సజావుగా జరిగేందుకు  ఏ.ఎస్.డబ్ల్యూ.ఓ – ఎస్.సి.డి.డి రాజన్న సిరిసిల్ల విధులు నిర్వహిస్తున్న ఎం విజయలక్ష్మిని తాత్కాలిక ప్రాతిపదికన జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారిగా అదనపు బాధ్యతలు కేటాయిస్తున్నట్లు సందీప్ కుమార్ ఝ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు.