కోడిగుడ్లు, నిత్యవసర వస్తువులన్నీ ప్రభుత్వమే సప్లై చేయాలి: తోపునూరి చక్రపాణి

Govt should supply chicken eggs and essentials: Topunuri Chakrapaniనవతెలంగాణ – (వేల్పూర్) ఆర్మూర్
కోడిగుడ్లు , నిత్యవసర వస్తువులన్నీ ప్రభుత్వమే సప్లై చేయాల నీ ఎండీఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు తోపునూరు చక్రపాణి అన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ త ఐదు నెలల నుండి బిల్లులు రాక మధ్యాహ్న భోజన కార్మికులు చాలా ఇబ్బంది ఎదురుకుంటున్నారు. గత ఐదు నెలల నుంచి తెచ్చి పెట్టిన డబ్బులకి దుకాణం దారులు అప్పిచ్చి ఉన్నారు . మా దగ్గర ఉన్న వస్తువుల్ని తాకట్టు పెట్టి ఇవ్వడం జరిగింది. మళ్లీ వంట చేసేముందు కచ్చితంగా కోడిగుడ్లు పెట్టాలి రాగి జావ పెట్టాలి అని చెప్పి చెప్పడం సరి అని కాదు ప్రభుత్వం తీరు మార్చు కొనాలి *రాగి జావా కోడిగుడ్లు పెట్టక పోవడానికి కారణము కార్మికులే అని చెపుతుంది.* ఇది సరి అయింది కాదు ? ప్రభుత్వం నకు ఒకటే విన్నవించు కుంటున్నాము . మాకు కోడిగుడ్లు పూర్తిస్థాయిలో సప్లై చేయండి అదేవిధంగా నిత్యావసర వస్తువు లన్ని సప్లై చేసి గ్యాస్ తో సహా ఇస్తే మేము దేనికైనా సిద్ధంగా ఉంటాము. అదేవిధంగా ప్రభుత్వము గత సంవత్సరం ఇచ్చిన మాట ప్రకారం గా 10000 రూ లు వేతనం ఇవ్వాలని అదేవిధంగా ఈ ఎస్ ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని కార్మికులు గా గుర్తించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూన్నం . కోడిగుడ్డు కు ప్రభుత్వం నుంచి మాకు ఐదు రూపాయలే వస్తున్నాయి. రాగి జావా కు సత్యసాయి సమితి కి 1:25 పై ప్రభుత్వము ప్రతినెల ఇస్తున్నది . మాకు రాగి జావా చేసినందుకు ఏమి కూడా ఇవ్వడం లేదు రాగిజావ కు రెండు రూపాయల 2/-స్లాబ్ రేటు గాని లేదా కోడిగుడ్లు ప్రభుత్వంగానే సప్లై చేయాలని కోరుతున్నాము . లేని పక్షములు రాబోయే కాలంలో ఆందోళన ఉదృతం చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి మీ ద్వారా హెచ్చరిస్తున్నట్టు తెలిపారు ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారికి వినతి పత్రం ఇచ్చినారు ఈ సమావేశంలో మండల అధ్యక్షురాలు లలిత, లక్ష్మి, కృష్ణబాయి, అర్చన ,రమ్య, కార్మికులు పాల్గొన్నారు.