– చేతులు మారిన డబ్బులు
నవతెలంగాణ – బాన్సువాడ నసురుల్లాబాద్
విద్యార్థినిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన కీచక ఉపాధ్యాయుడుని శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేసినట్లు మండల విద్యాశాఖ అధికారి తెలిపారు. బాన్సువాడ మండలంలోని దేశాయిపేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కీచక ఉపాధ్యాయుడు అనే నవతెలంగాణ అనే శీర్షికతో ప్రచురితం కావడంతో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బాన్సువాడ డి.ఎస్.పి టి సత్యనారాయణ సీఐ కృష్ణ ప్రత్యేకంగా విచారణ జరిపి కేసు నమోదు చేయడంతో జిల్లా విద్యాశాఖ సస్పెండ్ చేసినట్లు తెలిపారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయునిపై ఈ సమస్యను రాజీ కుదిరించేందుకు ప్రయత్నించిన తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు వీరిని రిమాండ్కు తరలించేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. ఈ రాజి కుదిరించడం కోసం డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణ ఉంది. మరికొంత పూర్తిస్థాయి విచారణ జరుగుతే డబ్బులు ఎవరెవరికి ఇచ్చారు అనే కోణంలో విచారణ చేస్తే మరికొంతమంది పేర్లు బయటికి వచ్చే అవకాశం ఉందని ఆ గ్రామస్తులు తెలిపారు.