– ప్రభుత్వ భూములు, అటవీ భూములు అన్యాక్రాంతం కాకుండా కంచె వేయించాలి
– వచ్చే శుక్రవారం నాటికి అన్ని ప్రభుత్వ స్థలాలకు కంచె ఏర్పాటు చేయాలి
నవతెలంగాణ – నల్లగొండ కలెక్టరేట్
వర్షం కారణంగా చెరువులు, కుంటలకు గండ్లు పడకుండా ముందే పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం అయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఆర్డీవోలు, ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లాలో ఎక్కడైనా వర్షం నీటికి తెగిపోయెందుకు, గండ్లు పడేందుకు అవకాశం ఉన్న చెరువులను గుర్తించి వాటికి తగిన విధంగా మరమ్మతులు చేపట్టాలని అన్నారు. ఒండ్రు మట్టి, మొరం, ఇసుక వంటివి అక్రమ రవాణా జరగకుండా చర్యలు తీసుకోవాలని, మట్టి విషయంలో ఏవైనా సమస్యలు ఉంటే తక్షణమే రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకురావాలని అన్నారు. ప్రభుత్వ భూములు, అటవీ భూములు అన్యాక్రాంతం కాకుండా కంచె వేయించాలని, ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వ,అటవీ భూములు అన్యాక్రాంతం కావడానికి వీలులేదని చెప్పారు. ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా వచ్చే శుక్రవారం నాటికి అన్ని ప్రభుత్వ స్థలాలకు కంచె ఏర్పాటు చేయాలని చెప్పారు.జిల్లాలోని వివిధ ప్రాజక్టుల కింద భూసేకరణను ఆయన సమీక్షిస్తూ ప్రాధాన్యత ప్రకారంగా భూసేకరణ సమస్యలు పరిష్కరించాలని, అలాగే ప్రాజక్టుల పనులకు సంబంధించి పురోగతి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆయా ప్రాజెక్టుల కింద రిజర్వాయర్ల వారిగా భూసేకరణ పిఎన్, పిడి తదితర వివరాలను ఇంజనీరింగ్ అధికారులతో అడిగి తెలుసుకున్నారు. భూసేకరణ పై సోమవారం లేదా మంగళవారం సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారులతో సమావేశం నిర్వహించాల్సిందిగా ఇరిగేషన్ అధికారులకు సూచించారు. అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, స్పెషల్ కలెక్టర్ నటరాజ్, డిఎఫ్ఓ రాజశేఖర్, ఎస్ఎల్బిసి సూపరింటిండెంట్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి, ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు,