విద్యార్థులకు టై ,బెల్ట్, ఐడెంటిటీ కార్డు, అందజేసిన డాక్టర్ కస్తూరి లక్ష్మీనారాయణ..

Dr. Kasturi Lakshminarayana, Head of Kasturi Hospital, Bhuvanagiri District Center at Veeravelli village in Bhuvangiri Mandal Friday School– బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులకు సన్మానం…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలంలోని వీరవెల్లి గ్రామంలో భువనగిరి జిల్లా కేంద్రంలోని కస్తూరి హస్పటల్ అధినేత డాక్టర్ కస్తూరి లక్ష్మీనారాయణ శుక్రవారం పాఠశాల విద్యార్థులకు టై , బెల్టు, షూస్ ఐడెంటి కార్డు లు అందజేశారు. అనంతరం బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులను పూలమాల, శాలువాతో ఘనంగా సన్మానించారు .
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన సొంత గ్రామం కావడంతో విద్యార్థులకు తన వంతు సహకారంగా డ్రెస్ మెటీరియల్స్, ఇతర సామాగ్రి అందజేసినట్లు తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్యామసుందరి, తాజా మాజీ సర్పంచ్ తంగిలపల్లి కల్పనా శ్రీనివాసచారి, తాజా మాజీ ఎంపీటీసీ కంచి లలిత మల్లయ్య, విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.