బాదితులకు సీఎం రిలీఫ్ ఫండ్ అందజేత

CM will give relief fund to the victimsనవతెలంగాణ – కొనరావుపేట
కొనరావుపేట మండల కేంద్రంలో  సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ పని అమృతవ్వ రూ.19500 గడిపెల్లి గంగవ్వ రూ.9000  చెక్కులను మాజీ ఎంపీటీసీ దేవరకొండ నరసింహ చారి కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు మాందాల లింబయ్య అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిరుపేదలు ఖరీదైన వైద్యం చేయించుకొని డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు. వారి సంక్షేమం కోసం ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ ఆసరాగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులుముదాం సత్యం, కస్తూరి రాంరెడ్డి, మల్లారెడ్డి, ప్రదీప్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.