
ప్రజాసమస్యలు పరిష్కారం కోరుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ రైతు, వ్యవసాయ, ఆదివాసీ సంఘాల ఆద్వర్యంలో ఈ నెల 18 న ఉమ్మడిగా తలపెట్టిన కలెక్టరేట్ లు ముట్టడి ని విజయవంతం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు దొడ్డా లక్ష్మినారాయణ పార్టీ, అనుబంధ సంఘాల శ్రేణులకు పిలుపు నిచ్చారు. పార్టీ మండల కమిటీ ఆద్వర్యంలో కన్వీనర్ చిరంజీవి నేతృత్వం లో మండల కమిటీ సభ్యులు ముళ్ళగిరి గంగరాజు అధ్యక్షతన శుక్రవారం స్థానిక ప్రజా సంఘాల కార్యాలయం అయిన సుందరయ్య భవన్ నిర్వహించిన మండల కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశ, రాష్ట్ర, జిల్లా ప్రస్తుత రాజకీయాలు, కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు పై ఆయన ప్రసంగించారు. ప్రజా సమస్యలు పరిష్కారానికి ఐక్య కార్యాచరణ ఒక్కటే మార్గం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు పిట్టల అర్జున్, మండల కన్వీనర్ చిరంజీవి, సభ్యులు ముళ్ళగిరి గంగరాజు, గడ్డం సత్యనారాయణ, సోడెం ప్రసాద్, తగరం నిర్మల, మడిపల్లి వెంకటేశ్వరరావు, కలపాల భద్రం, ఏసు, అప్పారావు, సీతారామయ్య లు పాల్గొన్నారు.