బ్యాటరీలు చోరీ చేస్తున్న నిందితులు అరెస్టు 

Accused of stealing batteries arrested– గతంలో జైలుకు పోయి వచ్చినా తీరు మార్చుకొని నిందితులు
– నిందితులంతా బంధువులే
– రెండు గ్రూపులుగా ఏర్పాటు 
– నలుగురు అరెస్టు, 14 మంది పరారు
– 100 బ్యాటరీలు, ఒక ట్రాలీ ఆటో, రెండు సెల్ఫోన్లు స్వాధీనం
– వివరాలు వెల్లడించిన డీఎస్పీ శివరాం రెడ్డి 
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
నల్గొండ, సూర్యపేట జిల్లాలో ప్రభుత్వ స్కూల్స్ లో బ్యాటరీలను చోరీ చేస్తున్న రెండు ముఠాలలోని నలుగురు సభ్యులను అదుపులోకి  తీసుకొని వారి వద్ద నుండి 17 నేరాలకి సంబంధించి 7.18 లక్షల విలువ చేసే 100 బ్యాటరీలు, ఒక ట్రాలీ ఆటొ,  రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు నల్లగొండ డిఎస్పి  శివరాం రెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. నల్గొండ జిల్లాలో ప్రభుత్వం పేద విధ్యార్ధులకి కంప్యూటర్ పరిజ్ఞానం, డిజిటల్ క్లాస్సెస్ విధ్యను అంధించాలనే  ఉద్దేశముతో ప్రభుత్వ స్కూల్స్ కి కంప్యూటర్ పరికరాలతోపాటు వాటి నిర్వహణ కోసం విలువైన బ్యాటరీలను అందజేశారు. ఈ బ్యాటరీలు నల్గొండ  జిల్లాలో గత కొంత కాలంగా వరుసగా చోరీలకు గురవుతున్నాయి. దీంతో  జిల్లా విధ్యాశాఖ అధికారుల పిర్యాధుల మేరకు నల్గొండ జిల్లా ఎస్పి శరత్ చంధ్ర పవార్ ప్రత్యేక  దృష్టి సారించి జిల్లా పోలీసు, నేర విభాగములో పనిచేస్తున్న పోలీసు అధికారులకు నేరస్తులను పట్టుకునే బాధ్యతలను అప్పగించారు.
ఎస్పీ ఆదేశాల మేరకు శుక్రవారం తెల్లవారుజమున సుమారు 5 గంటల ప్రాంతములో పక్క సమాచారముతో సిసిఎస్, శాలిగౌరారం  పోలీసులు సంయుక్తముగా కలిసి నకిరేకల్  నుండి శాలిగౌరారం  మీధుగా హైదరాబాద్ కు బ్యాటరీల లోడ్ తో వెళ్ళుచున్న  ట్రాలీ ఆటొనీ శాలిగౌరారం గ్రామ పరిధిలోని ఎక్స్ రోడ్ లో ఆపీ అంధులో ఉన్న ఆటొ డ్రైవరుతో పాటు మరొక వ్యక్తినీ ఆధుపులోనికి తీసుకోనీ విచారించగా ఈ బ్యాటరీలను నల్గొండ సూర్యపేట్  జిల్లాలో ప్రభుత్వ స్కూల్ లలో చోరీ చేసినట్లు ఒప్పుకున్నారని తెలిపారు. నేరస్థులు ఇచ్చిన సమాచారము మేరకు నకిరేకల్ పట్టణములో మరొక దొంగల ముఠాలోని ఇద్దరు సభ్యులను కూడా ఆధుపులోనికి తీసుకొని వారి ఇంటి వద్ద ఉన్న చోరీ చేసిన  బ్యాటరీలను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు.మొదటగా పట్టుబడిన నేరస్థులు గోపాగాని జగన్,ఆవుల తిమ్మయ్య కాగా, వీరితోపాటు మరో 10 మంధి నేరస్థులు పరారీలో ఉన్నారని పేర్కొన్నారు.అంధులో 6 గురు మహిళా నేరస్థులు ఉన్నారు. రెండవ ముఠాకు చెందిన ఆవుల సంజీవ, నాగిళ్ళ నాగారాజు, మరో 4 గురు మహిళా నేరస్థులు పరారీలో ఉన్నారు.పైనా పట్టుబడిన నేరస్థులు,పరారీలో ఉన్న నేరస్థులు అంధరు  బంధువులు అవుతారని తెలిపారు.పట్టుబడిన, పరారీలో ఉన్న నేరస్థులు అంధరు నల్గొండ జిల్లా నకిరేకల్  పట్టణానికి చెంధినవారు.
పట్టుబడిన రెండు ముఠా సభ్యులు  గతములో నల్గొండ,సూర్యపేట్, మహబూబాద్ జిల్లాలో చోరీ నేరము చేసి పట్టుబడి జైలుకు వెళ్లి వచ్చారని, అయినా వారి ప్రవర్తనలో మార్పు రాలేదని, తిరిగి కుటుంభ సభ్యులతో సహ ప్రభుత్వ స్కూళ్లలో  బ్యాటరీలను చోరీ చేయాలనీ, నిర్ణయించుకున్నారని తెలిపారు.జిల్లాలో కట్టంగూరు, శాలి గౌరారాం, కేతేపల్లి, నక్రేకల్,తిప్పర్తి,మడ్గులపల్లి, సూర్యపేట్ జిల్లాలో సూర్యపేట్ రూరల్, చివ్వెంల, ఆత్మకూర్  (ఎస్),అర్వపల్లి పోలీసు స్టేషన్ పరిధిలలోని పలు గ్రామలలో  17 ప్రభుత్వ స్కూళ్లలో చోరి చేసినట్లు తెలిపారు. ముఠా సభ్యులను పట్టుకోవడములో నల్గొండ సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఎం.జితేంధర్ రెడ్డి ఆద్వర్యములో నకిరేకల్ ఇన్స్పెక్టర్ పి.రాజశేఖర్, శాలిగౌరారం సర్కిల్ ఇన్స్పెక్టర్ కె. కొండల్ రెడ్డి, శాలిగౌరారం ఎస్సై డి. సైదులు, ఎస్సైలు  గోపి కృష్ణ,అయిలయ్య,సిబ్బంధి,జి. విష్ణు వర్ధనగిరి,లింగా రెడ్డి, శ్రీధర్ రెడ్డి లు కిలక పాత్ర పోషించాలని, వారందరిని జిల్లా ఎస్పీ అభినందించినట్లు తెలిపారు.